- Telugu News Photo Gallery Cinema photos Do You Know About This Actress Who Became Global Brand Ambassador Of Maldives, Her Net Worth of 200 Crores, She Is Katrina Kaif
Maldives: తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కట్ చేస్తే.. మాల్దీవ్స్ దేశానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్.. ఆస్తులు రూ.200 కోట్లు..
టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు మాల్దీవ్స్ దేశానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా చేసింది. కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. కొన్ని సంవత్సరాలుగా ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది. అయినప్పటికీ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫాలోయింగ్ తగ్గడం లేదు. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ?
Updated on: Jun 11, 2025 | 2:20 PM

ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగుతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కట్ చేస్తే.. ఓ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ వయ్యారి.. ఆతర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. కట్ చేస్తే.. ఇప్పుడు మాల్దీవ్స్ దేశ పర్యాటక రంగానికి ప్రపంచ రాయబారిగా నియమించారు.

ఆమె మరెవరో కాదండి.. బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్. ఆమె 2003 చిత్రం బూమ్ తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతకు ముందు అందాల పోటీ విజేత. ఫ్యాషన్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఇప్పుడు మాల్దీవ్స్ దేశానికి ప్రపంచ రాయబారిగా ఎంపికైంది. మాల్దీవులు మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC/ విజిట్ మాల్దీవులు) ఇటీవల ఈ ప్రకటన చేసింది.

కత్రినా చివరిసారిగా విజయ్ సేతుపతితో కలిసి శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో కనిపించింది. 2019 లో ఆమె తన సొంత కాస్మెటిక్ బ్రాండ్ కే బ్యూటీని పరిచయం చేసింది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ. 224 కోట్లు. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్.. బిజినెస్ రంగంలో రాణిస్తుంది కత్రీనా.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. చివరగా మెర్రీ క్రిస్మస్ చిత్రంలో కనిపించింది. తెలుగులో కత్రీనా కేవలం మళ్లీశ్వరి అనే చిత్రంలో నటించింది. ఇందులో వెంకటేశ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కత్రీనా. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. కత్రీనా వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఆమె ఒక్కో చిత్రానికి రూ. 10-12 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. సంవత్సరానికి రూ.30 కోట్లు సంపాదిస్తుంది. ఆమెకు లండన్‌లో దాదాపు రూ. 7 కోట్ల విలువైన బంగ్లా ఉంది.



















