- Telugu News Photo Gallery Cinema photos Heroine Sapthami Gowda latest fabulous looks goes viral in social media
Sapthami Gowda: ఆ జాబిల్లి ఈ సుకుమారి చెంత వెన్నలను అప్పుగా అడగాదా.. ఫ్యాబులస్ సప్తమి..
సప్తమి గౌడ కన్నడ సినిమాలో ప్రధానంగా పనిచేసే భారతీయ నటి. దునియా సూరి దర్శకత్వం వహించిన 2020 చిత్రం పాప్‌కార్న్ మంకీ టైగర్‌తో ఆమె తన నటనా రంగ ప్రవేశం చేసింది. 2022లో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారాలోని లీలా పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆమె ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ మరియు రెండు SIIMA అవార్డులను అందుకున్నారు.
Updated on: Jun 11, 2025 | 2:25 PM

జూన్ 8, 1996న కర్ణాటక రాజధాని బెంగుళూరులో జన్మించింది వయ్యారి భామ సప్తమి గౌడ. ఆమె తండ్రి S. K. ఉమేష్ గౌడ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి పేరు శాంత గౌడ.

బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ. చదువుకొనే రోజుల్లో స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది ఈ అందాల తార. కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా ఉంది.

కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కాంతారా సినిమాతో ఫెమస్ అయ్యింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది.

అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి.

నితిన్ తమ్ముడు సినిమాతో తొలిసారి తెలుగులో కథానాయికగా నటించింది. ఇది జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు థామ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది. ఇందులో ఓ పాత్రలో కనిపించనుంది.




