- Telugu News Photo Gallery Cinema photos Directors who say that they can show their ability only with costume drama
Costumes: కాస్ట్యూమ్ డ్రామాతోనే సత్తా.. ఏంటా సినిమాలు.? ఎలా ఉండబోతున్నాయి.?
పిక్చర్ అబీ బాకీ హై అని అంటున్నారు కొందరు ఫిల్మ్ మేకర్స్. ఆ బాకీ ఉన్నది కూడా మామూలు పిక్చర్లు కాదు. ప్రేక్షకుల మధ్య బాగా ఫేమ్ అయిన సినిమాలే. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా తీసిన సినిమాలు బంపర్ హిట్ అయినప్పుడు, వాటి నెక్స్ట్ పార్టులు మాత్రం గ్రాండ్‌గా అనౌన్స్ అయ్యాయి. నెక్స్ట్ స్క్రీన్ మీద కాస్ట్యూమ్ డ్రామాలుగా కన్విన్స్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.
Updated on: Jul 20, 2024 | 3:10 PM

కాంతార సినిమా చూసినప్పుడు అంత పెద్ద హిట్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. పెట్టిన పెట్టుబడికి, వచ్చిన కలెక్షన్లకీ భూమీ, ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది. అందుకే డివైన్ బ్లాక్ బస్టర్ సినిమా అంటూ అందరూ మెచ్చుకున్నారు.

ఆల్రెడీ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు ఆవగింజంత కూడా తగ్గకుండా ప్రీక్వెల్ చేస్తున్నారు మేకర్స్. కాస్ట్యూమ్ డ్రామాగా మెప్పించడానికి సర్వ యత్నాలూ చేస్తున్నారు డైరక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి.

వీరశేఖరన్ సేనాపతి కథను ఇండియన్3లో చూపిస్తానని అన్నారు శంకర్. ఈ సినిమా 2025లో స్క్రీన్ మీదకు రావడం పక్కా. సేనాపతి తల్లిదండ్రుల కథగా ఈ సినిమా తెరకెక్కుతుందనే మాట వైరల్ అవుతోంది. తొలి స్వాతంత్ర పోరాట సమరంలో పాల్గొన్న వ్యక్తిగా వీరశేఖరన్ సేనాపతిని ప్రొజెక్ట్ చేస్తారు శంకర్. ఈ సినిమా కూడా కాస్ట్యూమ్ డ్రామానే.

ఈ మధ్య కాలంలో కథాకథనాలతో ప్రేక్షకులను కట్టిపడేసి, సడన్ హిట్‌గా పేరు తెచ్చుకున్న సినిమా బింబిసార. ఎప్పుడు ఏదో ఒక ప్రయోగం చేసే కల్యాణ్‌రామ్‌కి కెరీర్‌లో మరింత ఊపు తెచ్చింది ఈ సినిమా. బింబిసార సక్సెస్ చూసి కెప్టెన్ వశిష్టకు విశ్వంభర ఆఫర్ ఇచ్చారంటేనే, బింబిసార స్టామినా ఏంటో అర్థమవుతుంది.

ఇప్పుడు ఆ బింబిసారకి ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. కెప్టెన్ మారినా, కాలం మారినా ప్రేక్షకుడు మెచ్చిన కాస్ట్యూమ్ డ్రామాలో మార్పు ఉండదంటూ హింట్ ఇచ్చేశారు నందమూరి కల్యాణ్‌రామ్. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ ఎలా కనిపిస్తారోననే ఆసక్తి మెండుగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జనాలను పలకరించడానికి సిద్ధమవుతోంది బింబిసార ప్రీక్వెల్.




