- Telugu News Photo Gallery Cinema photos Director Sukumar Wife Tabitha Sukumar Birthday Celebration Photos Goes Viral In Social Media
Sukumar: భార్య పుట్టిన రోజును వేడుకను సుకుమార్ ఎంత గ్రాండ్‌గా నిర్వహించారో చూశారా.? వైరల్ ఫొటోలపై ఓ లుక్కేయండి..
Sukumar: ట్యాలెంట్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా తన భార్య తబితా సుకుమార్ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు. తాజ్ ఫలక్‌నామాలో ఇచ్చిన ఈ బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి..
Updated on: Sep 25, 2021 | 6:55 AM

ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించే సినీ సెలబ్రెటీల్లో దర్శకుడు సుకుమార్ ఒకరు. సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా సుకుమార్ కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంటారు.

ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కుటుంబంతో గడిపే సుకుమార్ తాజాగా తన భార్య తబిత సుకుమార్ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు.

తాజ్ ఫలక్ నామాలో సర్‌ప్రైజ్ పార్టీ ఇచ్చారు సుకుమార్. సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన తబిత 'మీ ఆత్మీయుల మధ్య ఉన్నప్పుడు ఏ వేడుక అయినా అద్భుతంగా జరుగుతుంది' అంటూ క్యాప్షన్ జోడించారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. భార్యతో పాటు పాప, బాబుతో సుకుమార్ దిగిన ఫొటోలు చూసిన ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక తబిత విషయానికొస్తే ఆమె.. లాండ్రీ కార్డ్ పేరుతో ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికే 'లాండ్రీ కార్డ్' పేరుతో మూడు బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా సుకుమార్ రైటింగ్స్ బాధ్యతల్ని కూడా ఆమె చూస్తున్నారు. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న 'పుష్ఫ' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.




