- Telugu News Photo Gallery Cinema photos Deputy CM Pawan Kalyan give clarity about his Upcoming Movies og hari hara veeramallu
Pawan Kalyan: సినిమాలపై కుండ బద్దలు కొట్టిన పవన్
ప్రతీసారి పవన్ కళ్యాణ్ సినిమాలపై వాళ్లు వీళ్ళు అప్‌డేట్స్ ఇస్తుంటారు.. కానీ ఈసారి మాత్రం కాస్త డిఫెరెంట్. వాళ్లు వీళ్లు కాదు.. ఏకంగా పవనే తన సినిమాలపై అప్‌డేట్ ఇచ్చారు. ఏది ఎప్పుడొస్తుంది క్లారిటీ ఇచ్చారు. కానీ అందులోనే చిన్న మెలిక పెట్టారు. దాంతో ఫ్యాన్స్‌కు మళ్లీ కంగారు తప్పట్లేదు. మరి ఏంటా మెలికా..? ఇంతకీ పవన్ ఏం చెప్పారో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..
Updated on: Dec 31, 2024 | 1:17 PM

పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఎప్పుడూ ఎలా ఉంటుందో తెలియదు..! ఆయన ఉన్న బిజీకి సినిమా అసలు ఎప్పుడొస్తుందో క్లారిటీ ఉండదు.. దర్శక నిర్మాతలు కూడా ఆయన వచ్చినపుడే షూట్ చేసుకోవాలి. వాళ్లకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. బిజీగా ఉన్నా.. కానీ ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేస్తా అంటూ మాటిచ్చారు జనసేనాని.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీ. ఆయన నుంచి సినిమాలు ఊహించడం కూడా కష్టమే. కానీ అభిమానులు కదా.. ఆశ అంత ఈజీగా వదులుకోలేరు. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా అరుస్తూ గోల పెడుతూ తమ ప్రేమను చూపిస్తున్నారు.

తాజాగా దీనిపై కూడా స్పందించారు పవన్ కళ్యాణ్. వింటున్నారుగా.. అభిమానులు ఓజి ఓజి అని అరుస్తుంటే అవి తనకు బెదిరింపుల్లా వినిపిస్తున్నాయంటూ నవ్వుకుంటూ చెప్పారు పవన్ కళ్యాణ్.

తాజాగా మీడియాతో ముచ్చటించిన పవన్.. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం దగ్గర నుంచి మొదలుపెట్టి.. ఏపీ రాజకీయాలు, తన సినిమాల వరకు అన్నీ మాట్లాడారు. అందులో తన మూడు సినిమాలపై కుండ బద్ధలు కొట్టేసారు.

తను ఇచ్చిన డేట్స్‌ను దర్శక నిర్మాతలే వాడుకోలేదంటూ చెప్పుకొచ్చారు పవన్. తన కాల్షీట్స్ ఇచ్చే సమయంలో ఉస్తాద్ స్క్రిప్ట్ పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు పవన్. అలాగే వీరమల్లు మరో 8 రోజుల షూట్ మిగిలుందని.. ఓజి కూడా త్వరలోనే అయిపోతుందని తెలిపారు. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తానని మాటిచ్చారు పవన్. ఈ లెక్కన 2025లో పవన్ నుంచి 2 సినిమాలైతే కచ్చితంగా ఊహించొచ్చు.




