- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi focus on that genre for three years which was attracted him.
Chiranjeevi: మూడేళ్ళ పాటు ఆ జోనర్పైనే ఫోకస్.. చిరును ఆకర్శించిన జోనర్ ఏంటి.?
భోళా శంకర్ తర్వత చిరంజీవి ఒక రకమైన జోనర్‌లోనే ఉండిపోవాలని ఫిక్సైపోయారా..? కొన్నాళ్లు అలాంటి సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా..? ఎంత మంచి దర్శకుడు వచ్చినా కూడా ఆ జోనర్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదా..? రాబోయే రెండు మూడేళ్ళ పాటు ఆ ఒక్క జోనర్ పైనే ఫోకస్ చేయాలని ఫిక్సయ్యారా..? మరి చిరును ఆకర్షిస్తున్న ఆ జోనర్ ఏంటి..?
Updated on: May 20, 2025 | 3:00 PM

ఒక్క సినిమాతో చిరంజీవిలో చాలా మార్పులే వచ్చాయి. ముఖ్యంగా భోళా శంకర్ తర్వాత రీమేక్ సినిమాలకు నో అంటున్నారీయన. అందుకే కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాను కూడా పక్కనబెట్టారు.

అలాగే రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు.. ఈ క్రమంలోనే ఫ్రెష్‌గా ఉంటుందని విశ్వంభర చేస్తున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత తన కెరీర్‌లో ఎప్పుడూ సోషియో ఫాంటసీ సినిమాలు చేయలేదు చిరంజీవి.

ఇన్నేళ్ళ తర్వాత వశిష్టతో ఆ జోనర్‌లోకి వెళ్లారు మెగాస్టార్. అదే విశ్వంభర. ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే డేట్ కూడా ప్రకటించనున్నారు మేకర్స్. దాంతో పాటు అనిల్ రావిపూడి సినిమాను అనౌన్స్ చేసారు చిరంజీవి.

అనిల్ రావిపూడి సినిమా పూర్తిగా ఎంటర్‌టైన్మెంట్ జోనరే. అందులో ఎలాంటి లాజిక్స్ ఉండవు.. హాయిగా సంక్రాంతికి ఫ్యామిలీస్‌తో పాటు రెండున్నర గంటలు నవ్వుకునే సినిమా చేస్తున్నారు చిరు, అనిల్. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో సాగే ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.

భోళా శంకర్ తర్వాత మాస్ యాక్షన్ సీరియస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసారు చిరు. అందుకే అనిల్ రావిపూడితో సరదా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బాబీతోనూ ఫుల్ లెంత్ ఎంటర్‌టైనర్‌కు రెడీ అవుతున్నారు. 2026లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వచ్చే అవకాశముంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.




