- Telugu News Photo Gallery Cinema photos Check Shah Rukh Khan costliest Watch and other Indian Celebrity Watch Collections
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు హైక్లాస్‌గా బతికేయొచ్చు..! ఈ సెలబ్రెటీల వాచ్ ధరలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
సెలబ్రెటీల లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.. కాస్ట్లీ కారులు, బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన వాచ్‌లు మెయింటేన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ వాడే వాచ్ కలెక్షన్స్ చూస్తే మైండ్ బాక్ అవ్వాల్సిందే.. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ , సల్మాన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ ఇలా స్టార్స్ వాడే వాచ్‌ల్లో చాలా ఖరీదైన వాచ్‌లు ఉంటాయి.
Updated on: Jul 29, 2025 | 2:44 PM

షారుక్ ఖాన్ వాడే వాచ్‌ల ధర లక్షల్లో ఉంటాయి. షారుక్ దగ్గర ఎన్నో రకాల వాచ్‌లు ఉన్నాయి. షారుక్ దగ్గర ఉన్న అత్యంత కాస్ట్లీ వాచ్.. "పటేక్ ఫిలిప్" దీని ధర రూ.8.43 కోట్లు. ఆతర్వాత షారుక్ దగ్గరున్న వాటిలో కాస్ట్లీ వాచ్ "ఆడెమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ " ఈ సూపర్ స్టైలిష్ వాచ్ ధర రూ. 5 కోట్లు.

ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వాచ్‌లో "ఆడెమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్" ఒకటి .ఈ రోజ్-గోల్డ్ పెర్పెచువల్ మోడల్ విలువ దాదాపు రూ. 2 కోట్లు. ఈ వాచ్ సూపర్ లుక్‌లో ఉంటుంది.

సల్మాన్ ఖాన్ తరచూ ఖరీదైన వాచ్‌లతో కనిపిస్తుంటాడు. అందులోనూ వజ్రాలు పొదిగిన వాచీలు అంటే సల్మాన్‌కు చాలా ప్రీతి. సల్మాన్ దగ్గరున్న కాస్ట్లీ వాచ్ జాకబ్ అండ్ కో బిలియనీర్ III లగ్జరీ. ఈ వాచ్ లో 152 తెల్లని వజ్రాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో 76 వజ్రాలు ఉంటాయి. అలాగే బ్రాస్‌లెట్‌లో 504 వజ్రాలు ఉన్నాయి. అలా మొత్తం కలిపి వాచ్‌లో 714 వజ్రాలు ఉన్నాయి. ఈ వాచ్ ధర సుమారు రూ.41.5 కోట్లు.

ఇక బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్‌కు కూడా వాచ్‌లంటే చాలా ఇష్టం. ఆతని దగ్గర కూడా ఎన్నో రకాల వాచ్‌లు ఉన్నాయి. కాగా రణబీర్ కపూర్ వాడుతున్న ఖరీదైన వాచ్ "పాటెక్ ఫిలిప్ క్రోనోగ్రాఫ్" దీని ధర ఏకంగా రూ. 6కోట్లు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా వాచ్‌లంటే చాలా ఇష్టం ఆయన దగ్గర కూడా ఎన్నో రకాల వాచ్‌లు ఉన్నాయి. తారక్ దగ్గరున్న వాచ్‌ల్లో ఖరీదైన వాచ్ "టూర్‌బిల్లాన్" దీని ధర దాదాపు రూ. 7.47 కోట్లు. అలాగే మెక్‌లారెన్ స్పీడ్‌టెయిల్: లిమిటెడ్ ఎడిషన్ F1 మోడల్ దీని ధర రూ. 4కోట్లు.




