Chandini Chowdary: అందం అభినయం ఉన్నా.. అవకాశాలు మాత్రం అందని ద్రాక్షే ఈ ముద్దుగుమ్మకు
షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా ఎదిగింది అందాల భామ చాందిని చౌదరి. అందం అభినయంతో మంది క్రేజ్ సొంతం చేసుకుంది. వైజాగ్ కు చెందిన ఈ అమ్మడు కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.
Updated on: Feb 22, 2024 | 3:27 PM

షార్ట్ ఫిలిమ్స్ నుంచి చాలా మంది హీరోలుగా , హీరోయిన్ గా ఎదిగారు. వారిలో ఈ చిన్నది కూడా ఒకరు. అందాల భామ చాందిని చౌదరి. అందం అభినయంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఆమె కేటుగాడు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది చాందిని

కేటుగాడు తరువాత వరుసగా కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్ , కలర్ ఫోటో , బొంభాట్ , సూపర్ ఓవర్ అలాగే సమ్మతమే చిత్రాల్లో నటించి మెప్పించింది. వైజాగ్ కు చెందిన ఈ అమ్మడు బెంగళూరులో చదువుతున్నప్పుడు చాలా షార్ట్ ఫిల్మ్‌లలో నటించారు. ఆతర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

షార్ట్ ఫిలిమ్స్ లో నటించే సమయంలోనే హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్, అలాగే రోమియో అండ్ జూలియట్ లాంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

2013లో మధురం అనే షార్ట్ ఫిల్మ్‌లో చాందినీ నటనను చూసిన ముళ్లపూడి వర మరియు కె. రాఘవేంద్రరావు ఆమెకు "కుందనపు బొమ్మ" చిత్రంలో అవకాశం ఇచ్చారు. కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది చాందిని.

కలర్ ఫోటో మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత అనుకున్నంతగా ఈ అమ్మడు కెరీర్ స్పీడ్ అందుకోలేదు. ఇక సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది చాందిని చౌదరి. తాజాగా కొన్ని గ్లామర్ ఫోటోలను వదిలింది.





























