- Telugu News Photo Gallery Cinema photos Cannes Filmfestival 2023: Anushka Sharma, Kennedy and more; Indians and Indian films to watch out for this year
Cannes Festival 2023: నేటి నుంచి ప్రారంభం కానున్న కేన్స్ ఫెస్టివల్.. బాలీవుడ్ నుంచి హాజరుకానున్న తారలు ఎవరంటే..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఫ్రాన్స్‌లో మే 16 నుంచి ప్రారంభం కానుంది. 76వ ఎడిషన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. ఈ వార్షిక చలనచిత్రోత్సవంలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు సినీ నటీనటులు హాజరవుతారు. మన దేశం నుంచి కూడా పలువురు తారలు రెడ్ కార్పెట్‌పై కనిపించనున్నారు.
Updated on: May 16, 2023 | 11:20 AM

11 రోజులపాటు జరగనున్న ఈ ఈవెంట్ లో బాలీవుడ్ నటి అనుష్క శర్మ, మానుషి చిల్లర్ తదితర భారత ప్రముఖ నటీనటులు దీనికి హాజరు కానున్నారు. హాలీవుడ్ నటి కేట్ విన్స్‌లెట్ సహా అనేక మంది సినిమా మహిళలను అవార్డులతో సత్కరించనున్నారు.

బాలీవుడ్ నుండి కేన్స్ 2023లో చేరేవారిలో విజయ్ వర్మ పేరు కూడా ఉంది. ఇది కేన్స్ 76వ ఎడిషన్.. ఈ వేడుకలకు విజయ్ కూడా హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో భాగమవుతారు.

ఈ జాబితాలో తదుపరి పేరు బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్. కేన్స్ 2023లో కూడా మానుషి తన అందాలను ప్రదర్శించనుంది.

బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అదితి రావ్ హైదరీ రెడ్ కార్పెట్‌పై కూడా మెరవనుంది. ఆమె కేన్స్ 2023కి కూడా హాజరు కానుంది.

కేన్స్ 2023లో బాలీవుడ్‌లో చేరిన తారల్లో చివరి పేరు అనుష్క శర్మ. అనుష్క కూడా రెడ్ కార్పెట్ పై కనిపించనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16 నుంచి మే 27 వరకు జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అనుష్క శర్మ పాల్గొనడం ఇదే తొలిసారి

గాయకుడు కుమార్ సాను కుమార్తె షానన్ కె. కూడా పాల్గొంటున్నారు. కంటెంట్ క్రియేటర్ డాలీ సింగ్ కూడా ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు.




