- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This South Actress In This Photo, She Is Heroine Sameera Reddy Chilhdood Photo
Tollywood: సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. ఇప్పటికీ ప్రేక్షకులకు ఇష్టమైన బ్యూటీ..
ప్రస్తుతం సోషల్ మీడియాలో దక్షిణాది స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి దక్షిణాదిని ఓ ఊపు ఊపేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది.
Updated on: May 16, 2025 | 9:19 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. ఎన్టీఆర్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషలోల అనేక చిత్రాల్లో నటించింది మెప్పించింది.

ఆమె మరెవరో కాదండి.. టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి. 2002 హిందీ చిత్రం 'మెమ్మే దిల్ తుజ్కో దియా'లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన వారణం ఆయిర్ సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది.

తెలుగులో ఎన్టీఆర్ సరసన అశోక్ చిత్రంలో నటించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవా చిత్రంలో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్ధన్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పెళ్లి తర్వాత చాలా కాలం విరామం తర్వాత సమీర మోహన్ లాల్ తో కలిసి 'ఒరుణాల్వారం' సినిమాలో నటించింది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోస్ షేర్ చేస్తుంది.

అలాగే కొన్నాళ్లుగా ఫిట్నెస్ పై అనేక విషయాలు పంచుకుంది. తన ఫిట్నెస్ జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు సూచనలు, సలహాలు ఇస్తుంది. సమీరా కథక్ నృత్యంలో శిక్షణ తీసుకుంది.




