- Telugu News Photo Gallery Cinema photos Boyapati Srinu next movie story and producer was ready but who will be the hero?
Boyapati Srinu: స్టోరీ రెడీ.. డబ్బులు పెట్టే నిర్మాత కూడా రెడీ.. మరి హీరో ఎక్కడ.?
ఆకులో కూరలు, స్వీట్ అన్ని ఉన్న అన్నం మాత్రం లేనేట్లు అయింది బోయపాటి పరిస్థితి. అదేంటి అంతలా ఏమైంది అని అనుకుంటున్నారా.. ఆ విషయం ఏంటి.? బోయపాటి గురించి ఎలా ఎందుకు అనాల్సి వచ్చిందో.. ఈ స్టోరీలో చూద్దాం రండి.. స్టోరీ రెడీ.. దర్శకుడు రెడీ.. డబ్బులు పెట్టే నిర్మాత కూడా రెడీ.. కానీ ఏం చేస్తాం కథలో కనిపించడానికి హీరోనే కరువయ్యాడు పాపం..!
Updated on: Apr 03, 2024 | 5:06 PM

రామ్ పోతినేని హీరోగా తెరకెక్కించిన స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత కూడా గీతా ఆర్ట్స్‌లో ఛాన్స్ అందుకున్నారు బోయపాటి. కానీ ఈయనకు నిర్మాత దొరికినంత ఈజీగా.. హీరో దొరకట్లేదు. ఇంతకీ బోయపాటి నెక్ట్స్ హీరో ఎవరు..?

సాధారణంగా ఓ ఫ్లాప్ ఇస్తే.. ఆ దర్శకుడి వైపు వెళ్లడానికి ఆలోచిస్తుంటారు నిర్మాతలు. కానీ బోయపాటి మాత్రం స్కంద తర్వాత అప్పుడే గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను ఒప్పించారు.

ఆయన్ని ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ బోయపాటి కథలో నటించడానికి హీరో కరువయ్యారిప్పుడు. బిజీ హీరోలను నమ్ముకుని.. తాను ఖాళీ అయిపోయారు బోయపాటి. గీతా ఆర్ట్స్‌లో బోయపాటి శ్రీను సినిమా అనగానే.. అందరూ ముందుగా అల్లు అర్జున్ కోసమే అనుకున్నారు.

కానీ బన్నీతో సినిమా అంటే బోయపాటి కనీసం మరో మూడేళ్లు వెయిట్ చేయాలి. ఎందుకంటే పుష్ప 2తో పాటు 3 కూడా ఉందంటున్నారు.. అలాగే అట్లీతో పాటు త్రివిక్రమ్ సినిమా లైన్‌లోనే ఉంది. ఇవన్నీ అవ్వాలంటే కనీసం రెండు నుంచి మూడేళ్లైనా పడుతుంది.

బన్నీ కాకపోయినా.. ఆస్థానంలో హీరో బాలయ్య ఉన్నాడుగా అనుకుంటే అఖండ 2ను రెండో కూతురు తేజస్విని బ్యానర్‌లో చేయాలనుకుంటున్నారాయన. అందుకే గీతా ఆర్ట్స్‌లో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యే అవకాశాలు తక్కువ. ఇక బాబీ తర్వాత హరీష్ శంకర్ సినిమాను లైన్‌లో పెడుతున్నారు బాలయ్య. ఎలా చూసుకున్నా.. ఇంకొన్నాళ్లు బోయపాటికి ఇంకొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు.




