తెలుగులో అలరించేందుకు సిద్ధమవుతున్న టాప్ బాలీవుడ్ హీరోయిన్లు.. ఎవరు ఏ హీరోతో సినిమాలు చేస్తున్నారో తెలుసా..

ప్రస్తుతం టాలీవుడ్‏లో పాన్ ఇండియా లెవల్ సినిమాల హావా కొనసాగుతుంది. టాలీవుడ్ దర్శకులు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. ఇదిలా ఉండగా.. తెలుగు నుంచి బీటౌన్‏లో తమ అదృష్టం పరీక్షించుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం బీటౌన్ ముద్దుగుమ్మల చూపు టాలీవుడ్ పై పడింది. ఇందులో భాగంగా ఈ ఏడాది తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

Mar 14, 2021 | 2:27 PM
Rajitha Chanti

|

Mar 14, 2021 | 2:27 PM

అలియా భట్.. ఆర్ఆర్ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుంది. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

అలియా భట్.. ఆర్ఆర్ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుంది. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

1 / 6
సాయి మంజ్రేకర్.. గని, మేజర్.. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా గని. ఇందులో వరుణ్‏కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సాయి మంజ్రేకర్ నటిస్తుంది. అంతేకాకుండా టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తు్న్న మేజర్ సినిమాలోనూ ఈ బ్యూటీ నటిస్తుంది.

2 / 6
 డియా మీర్జా.. వైల్డ్ డాగ్.. అక్కినేని నాగార్జున నటిస్తోన్న వైల్డ్ డాగ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ డియా మీర్జా నటిస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది దియా.

Dia Mirza

3 / 6
అనన్యపాండే.. లైగర్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. ఈ సినిమాను చార్మి నిర్మిస్తుంది. ఇందులో విజయ్‏కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యపాండే నటిస్తుంది.

Ananya Pandey

4 / 6
 జాక్వెలిన్ పెర్నాండెజ్..హరిహర వీరమల్లు.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్.. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఇందులో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుంది.

Jacqueline Fernandez

5 / 6
దీపిక పదుకొనే.. ప్రభాస్ 21.. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కేజీఎప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇదే కాకుండా.. అటు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. అందులో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుంది.

Deepika Padukone

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu