- Telugu News Photo Gallery Cinema photos Bollywood heroine alia bhatt birthday on march 15th know unkown facts about her
Happy Birth Day Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’ సీత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. అలియా అందమైన ఫోటోలు..
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో అలియా భట్ ఒకరు. ఇప్పటికీ వరకు బీటౌన్‌లో చిన్న హీరోలతోపాటు... అగ్రహీరోలందరితోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. మార్చి 15న బాలీవుడ్ దిగ్గజ నిర్మాత- దర్శకుడు మహేష్ భట్ అందాల తనయ అలియా భట్ పుట్టిన రోజు. ఆ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 15, 2021 | 9:29 AM

అలియాభట్ 1993 మార్చి 15న ముంబైలో జన్మించింది. సోనీ రజ్జాన్, మహేష్ భట్ దంపతుల కుమార్తె అలియా. ఆమె తల్లి యూకే మహిళ కావడం వలన అలియాకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది.

ఆరేళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర అరంగేట్రం చేసింది అలియా. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రీతి జింటా నటించిన సంఘర్ష్ చిత్రంలో అలియా భట్ నటించింది.

బాలీవుడ్ నిర్మాత- దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో అలియా హీరోయిన్‌గా నటించింది. 2012లో విడుదలైన ఈ సినిమాలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు.

రోజూ న్యూస్ పేపర్స్ చదవడం.. తనని తాను మరింత్ అప్ డేట్ చేసుకోవడానికి అలియా ఇష్టపడుతుంది. అలాగే.. రోజూ తన ఇంటి దగ్గర జాగింగ్ చేయడంతోపాటు పచ్చని పరిసరాలంటే కూడా అలియాకు ఇష్టం.

2013లో టైమ్స్ ఇండియా ఫిల్మ్ అవార్డులలో అలియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రానికి గానూ బెస్ట్ ఫీమేల్ డిబ్యూట్ అవార్డ్ అందుకుంది. అలాగే 2015లో హైవే చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది. 2017లో ఉడ్తా పంజాబ్ సినిమాకు గానూ.. ఫిలింఫేర్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

ప్రస్తుతం అలియా గంగుబాయి కతియావాడి, బ్రహ్మస్త్రా, ఆర్ఆర్ఆర్, సడక్-2, తఖ్త్, ఇన్షల్లా సినిమాల్లో నటిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.




