- Telugu News Photo Gallery Cinema photos Allu arjuns swanky vanity van that cost him a whopping rs 7 crore
Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ … అల్ట్రా స్టైలిష్ కారవాన్ .. చూస్తే మతిపోవాల్సిందే..
గంగోత్రి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస విజయాలతో అతితక్కువ కాలం లోనే స్టార్ హీరోగా మారిపోయాడు బన్నీ.
Updated on: Mar 15, 2021 | 2:31 PM

గంగోత్రి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస విజయాలతో అతితక్కువ కాలం లోనే స్టార్ హీరోగా మారిపోయాడు బన్నీ.

ఇక తన డైన నటన, అదిరిపోయే డ్యాన్స్ లతో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నాడు.

డ్యాన్స్ లు, డైలాగులతోనే కాదు సినిమా సినిమాకు స్టైలిష్ లుక్స్ తో స్టైలిష్ స్టార్ అనే బిరుదును పొందాడు బన్నీ

ఇక అల్లు అర్జున్ కారవాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇది బన్నీ పాత క్యార్ వ్యాన్ దీనిని 2019లో బన్నీ కొనుగోలు చేసాడు

అత్యంత ఖరీదైన ఈ కారవాన్ కు 'ఫాల్కన్' అని పేరు పెట్టాడు బన్నీ. ఈ వ్యాన్ ఖరీదు అక్షరాలా 7 కోట్లరూపాయలు.

అలాగే బన్నీ కోసం ఈ అత్యాధునికమైన ఈ స్వాన్కీ వానిటీ వ్యాన్ ను రెడ్డి కస్టమ్స్ వారు రూపొందించారు.

అద్భుతమైన టెక్నాలజీతోనే కాదు అత్యంత విలాసవంతంగాను ఈ వ్యాన్ ను రూపొందించారు.

సూపర్ స్వాన్కీ వానిటీ వాన్ కాకుండా అల్లు అర్జున్ గ్యారేజీలో రేంజ్ రోవర్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5, ఆడి ఎ 7 అలాగే జాగ్వార్ ఎక్స్‌జెఎల్ కూడా ఉన్నాయి.

గతంలో అల్లుఅర్జున్ తన నిటీ వ్యాన్ 'ఫాల్కన్' ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.




