- Telugu News Photo Gallery Political photos New speculations on the political entry of ntr junior talks at evaru meelo koteswarudu promo launch time
Jr ntr political entry : ఇంతకీ రాజకీయాల్లోకి వస్తారా? రా రా? ఎవరు కోటీశ్వరులు ప్రొమో లాంచింగ్ వేళ ఎన్టీఆర్ మాటలతో కొత్త డౌట్లు.!
Jr ntr political entry : మొన్నటికి మున్న.. చంద్రబాబు తిరుపతి పర్యటనలో రామయ్యా.. రావయ్యా అంటూ ఫ్లెక్సీలు కట్టగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఆయన రాజకీయ ప్రవేశం ప్రస్తావనకు వచ్చింది.
Updated on: Mar 13, 2021 | 6:30 PM

రాజకీయాల్లోకి వస్తారా? రా రా? వస్తే ఎప్పుడు? ఇదే ఇప్పుడు బిగ్ డిబేట్.. ఏపీ టు తెలంగాణ, సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల వరకు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మొన్నటికి మున్న.. చంద్రబాబు తిరుపతి పర్యటనలో రామయ్యా.. రావయ్యా అంటూ ఫ్లెక్సీలు కట్టగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఆయన రాజకీయ ప్రవేశం ప్రస్తావనకు వచ్చింది. ఆయనే నందమూరి ఫ్యామిలీ వారసుడు, చర్చకు తెరలేపిన నాయుకుడు.. జూనియర్ ఎన్టీఆర్.

ఇంతకీ, ఎన్టీఆర్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉందా? అంటే, ఈ మాటలు చాలు. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పడానికి. అసలు మనస్సులో అలాంటి ఉద్దేశమే లేకపోతే.. స్ట్రేట్ వే.. నో అని చెప్పేసే వారు. అయితే చెప్పకనే చెప్పారు.. తన మనస్సులోని మాట. రావడం పక్కా.. రాసుకో సాంబ అన్నట్లు.. ఎంట్రీ ఎప్పుడు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.

ఇది సమయమూ కాదు.. సందర్భమూ కాదు. ఇవీ.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రొమో లాంచింగ్ సందర్భంగా ఎన్టీఆర్ అన్నమాటలు. అయితే ఆ సందర్భం ఎప్పుడు రాబోతుంది? దానికంటూ ప్రత్యేకంగా ఓ సందర్భం కావాలా! ఆయన మనస్సులో అనుకుంటే సరిపోదా.. అన్నది కొంత మంది వాదన. అబ్బే సినిమాల్లో బిజీగా ఉన్న తారక్.. మరికొన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీయాలన్నది ఇంకొందరి వాదన.

ఇదే ప్రశ్నను శనివారం ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోమో లాంచింగ్ వేళ ఓ జర్నలిస్ట్ తారక్‌కు సంధించారు. దానికి ఎన్టీఆర్ తన మార్క్ స్పందన ఇచ్చారు. గుట్టు విప్పకుండా స్వీట్‌గా సైడైపోయారు. మీరే చెప్పండి ఎప్పుడు రావాలో అని తొలుత తిరిగి ప్రశ్నించిన ఎన్టీఆర్.. ఇప్పుడు దాని గురించే మాట్లాడే సందర్భం కాదంటూ దాటవేశారు. మరోసారి కూర్చునీ కాఫీ తాగుతూ తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పారు. సో.. దీనిపై మరింతకాలం సస్పెన్స్ కొనసాగించాలని తారక్ డిసైడైనట్టున్నారు.



