ఢిల్లీ శివారులో కొనసాగుతున్న రైతుల నిరసన.. ‘కిసాన్ సోషల్ ఆర్మీ’ సాయంతో ఇటుకలపై పక్కా ఇళ్లు
ఢిల్లీ హర్యానా సమీపంలోని తిక్రి బోర్డర్లో 'కిసాన్ సోషల్ ఆర్మీ' సొంతంగా శాశ్వత ఇళ్లు నిర్మిస్తున్నారు.

farmers build brick homes at delhi haryana borders
- వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ మూడు నెలలకుపైగా ఆందోళన చేస్తున్న రైతులు కొత్త బాటపట్టారు. ఢిల్లీ హర్యానా సమీపంలోని తిక్రి బోర్డర్లో ‘కిసాన్ సోషల్ ఆర్మీ’ సొంతంగా శాశ్వత ఇళ్లు నిర్మిస్తున్నారు.
- ఇటుకలు, సిమెంట్ తదితరాలతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సామాగ్రికి వీరు చార్జీలు చెల్లిస్తున్నా.. లేబర్ కార్మికులకు మాత్రం ఏ విధమైన చెల్లింపులూ జరపడంలేదు.
- చాలామంది రైతులు తమ ట్రాక్టర్లను తాత్కాలిక షెల్టర్లుగా మార్చేశారు. పంట కోతల కాలం గనుక పలువురు తమ ట్రాక్టర్లను గ్రామాలకు పంపివేశారు.
- అతి చౌకగా వీటి నిర్మాణం సాగుతోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఖర్చవుతోందని అంచనా.
- కిసాన్ సోషల్ ఆర్మీ వరుసగా 170 రోజులు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతు నిరసన కోసం అనేక శాశ్వత నిర్మాణాలను నిర్మించింది.









