- Telugu News Photo Gallery Business photos Modi government scheme for people above 60 years get rs 3000 pension
Pension Scheme: మరో అదిరిపోయే స్కీం.. నెలకు రూ. 3 వేలు పెన్షన్.. వివరాలు ఇవే..(Photo Gallery)
Modi Government: పేదలు, వృద్దులకు లబ్ది చేకూరేలా, వారికి ఆర్ధికంగా సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వం పలు రకాల పధకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
Updated on: Mar 13, 2021 | 1:40 PM

పేదలు, వృద్దులకు లబ్ది చేకూరేలా, వారికి ఆర్ధికంగా సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీం ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ (పీఎం-ఎస్‌వైఎం)

ఈ పధకం కింద అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు కనీస రూ .3000 పెన్షన్ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సుమారు 45 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

18- 40 సంవత్సరాల వయస్సు ఉన్న కార్మికులు ఈ పధకానికి అర్హులు కాగా.. వారి నెలసరి జీతం రూ.15,000 కన్నా తక్కువ ఉండాలి. ఈ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ద్వారా నిర్వహిస్తోంది, అందువల్ల ఎల్ఐసి కూడా పెన్షన్ చెల్లిస్తుంది.

”ప్రధాన మంత్రి శ్రామ్ యోగి మన్-ధన్ యోజన”(పిఎం-ఎస్వైఎం) పథకం కింద నెలకు రూ .55 నుంచి 200 రూపాయల వరకు జమ చేయవచ్చు. ఇందులో 18 ఏళ్లు నిండిన వారు నెలకు రూ .55, 30 ఏళ్లు నిండిన వారు రూ .100 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 40 ఏళ్లు నిండిన వారు నెలకు రూ .200 చెల్లించాలి. వీరందరూ 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బును జమ చేయాల్సి ఉంటుంది.

ప్రధాన్ మంత్రి శ్రామయోగి మంధన్ పెన్షన్ యోజనలో రిజిస్ట్రేషన్ కోసం కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సి సెంటర్)ను సంప్రదించాలి. వారి వెంట తమ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్‌ను తీసుకెళ్ళాలి.





