- Telugu News Photo Gallery Cinema photos Actress Madhuri Dixit Honored With Special Recognition For Contribution To Bharatiya Cinema Award IFFI
Madhuri Dixit: అందాల తారకు మరో అరుదైన గౌరవం.. IFFI వేడుకల్లో మాధురీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం
అలనాటి అందాల తార, ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ కు మరో అరుదైగన గౌరవం లభించింది. గోవా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా ఆమెను 'స్పెషల్ రికగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు భారతీయ సినిమా' అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం.
Updated on: Nov 22, 2023 | 7:22 PM

లనాటి అందాల తార, ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ కు మరో అరుదైగన గౌరవం లభించింది. గోవా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా ఆమెను 'స్పెషల్ రికగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు భారతీయ సినిమా' అవార్డుతో సత్కరించారు.

భారతీయ సినిమాకు గానూ మాధురీ దీక్షిత్ చేసిన సేవలకుగానూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానాన్ని అందజేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఈ సందర్భంగా మాధురీ దీక్షిత్‌కు శుభాకాంక్షలు కూడా తెలిపారు అనురాగ్ ఠాకూర్. సినీ రంగంలో రాణిస్తున్న ప్రతిభావంతురాలు, ప్రముఖ నటి మాధురికి 'స్పెషల్ రికగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు భారతీయ సినిమా' అవార్డును అందజేయడం ఆనందంగా ఉందని 54వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం పేర్కొంది.

54వ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ సోమవారం (నవంబర్ 20) ప్రారంభమైంది. మొత్తం 9 రోజుల పాటు ఫిల్మ్ ఫెస్టివల్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన ప్రముఖ సినీ నిర్మాతలు, దర్శకులు పాల్గొంటున్నారు.

కాగా మాధురీ దీక్షిత్ బీజేపీ పార్టీలో చేరి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం చర్చనీయాంశమైంది.





























