- Telugu News Photo Gallery Cinema photos Heroine Nayanthara is active on social media Telugu Actress Photos
Nayanthara: సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నయనతార.. నార్త్ లో ఆలియా, సౌత్‌లో నయన్..
నిన్నటిదాకా దూరం దూరం అంటున్న నయనతార, ఇప్పుడు ఆ దూరాన్నే దూరం పెట్టేశారు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అయ్యారు. జస్ట్ తన విషయంలోనే కాదు, పిల్లల విషయంలోనూ జోరు పెంచుతున్నారు నయన్. ఆమెలో వచ్చిన మార్పు చూసి వారెవా అంటున్నారు జనాలు. ఫెలో హీరోయిన్లు దాస్తున్న ఓ విషయంలో నయన్ మాత్రం యమా ఫ్లెక్సిబుల్‌గా ఉంటున్నారు. ఇంతకీ ఏ విషయం అంటారా? కిడ్స్ టాపిక్ అండీ!
Updated on: Nov 22, 2023 | 4:22 PM

నిన్నటిదాకా దూరం దూరం అంటున్న నయనతార, ఇప్పుడు ఆ దూరాన్నే దూరం పెట్టేశారు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అయ్యారు. జస్ట్ తన విషయంలోనే కాదు, పిల్లల విషయంలోనూ జోరు పెంచుతున్నారు నయన్.

ఆమెలో వచ్చిన మార్పు చూసి వారెవా అంటున్నారు జనాలు. ఫెలో హీరోయిన్లు దాస్తున్న ఓ విషయంలో నయన్ మాత్రం యమా ఫ్లెక్సిబుల్‌గా ఉంటున్నారు. ఇంతకీ ఏ విషయం అంటారా? కిడ్స్ టాపిక్ అండీ!

గతంలో తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచించిన నయన్, ఇప్పుడు ఆల్ ఐడీస్‌నీ వెరిఫై చేయించుకుని ట్రెండ్‌లో ఉంటున్నారు. రీసెంట్‌గా ఆమె బర్త్ డేకి హోరెత్తింది సోషల్ మీడియా.

పిల్లలిద్దరితో నయన్ తరచుగా పోస్ట్ చేస్తున్న పిక్స్ గురించి కూడా డిస్కషన్ జరుగుతోంది. నయనతార పిల్లల పిక్స్ తో ఇప్పుడు పబ్లిక్‌కి దగ్గర కావడానికి ట్రై చేస్తుంటే, నియర్ ఫ్యూచర్‌లోనూ పాప ఫేస్‌ని రివీల్ చేసేలా లేరు ఆలియా.

పిల్లల ఫొటోలను షేర్ చేసే టాపిక్ మీద రీసెంట్‌గా కాస్త సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు ఆలియా. తన కూతురిని ఇన్‌స్టా పీస్ చేయడం ఇష్టం లేదని స్ట్రాంగ్‌గా చెప్పేశారు.

నార్త్ లో ఆలియా, సౌత్‌లో నయనతార ఇద్దరూ ఒకే స్ట్రేచర్‌లో ఉన్న నాయికలు. అలాంటిది పిల్లల విషయంలో ఒకరు అలా, ఇంకొకరు ఇలా స్పందిస్తుండటంతో, ఎవరి అభిప్రాయాలు వాళ్లవంటున్నారు క్రిటిక్స్.




