- Telugu News Photo Gallery Cinema photos Power star pawan kalyan and harish shankar movie ustaad bhagat singh update on 22 11 2023 Telugu Heroes Photos
Power Kalyan – Ustad Bagah Singh: పవన్ కళ్యాణ్ పక్కకు వెళ్లినట్లే.. అతడితో హరీష్ శంకర్ కన్ఫర్మ్..!
పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఇప్పుడు వైకుంఠపాళి ఆట అని అర్థం. ఎప్పుడు డేట్స్ అనే నిచ్చెన ఎక్కిస్తాడో.. ఎప్పుడు పొలిటికల్ టూర్ అనే పాము నోట్లో పడేస్తాడో దర్శక నిర్మాతలకు ఐడియా ఉండదు. నిజం చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్‌కు కూడా తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలియదు. పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సినిమా టెన్షన్స్ పెట్టుకోవద్దని ఫిక్సైపోయాడు జనసేనాని. అందుకే దర్శకులకు కూడా ఇతర సినిమాలు చేసుకోడానికి స్వేచ్ఛనిచ్చాడు.
Updated on: Nov 22, 2023 | 2:45 PM

పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఇప్పుడు వైకుంఠపాళి ఆట అని అర్థం. ఎప్పుడు డేట్స్ అనే నిచ్చెన ఎక్కిస్తాడో.. ఎప్పుడు పొలిటికల్ టూర్ అనే పాము నోట్లో పడేస్తాడో దర్శక నిర్మాతలకు ఐడియా ఉండదు. నిజం చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్‌కు కూడా తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలియదు.

పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సినిమా టెన్షన్స్ పెట్టుకోవద్దని ఫిక్సైపోయాడు జనసేనాని. అందుకే దర్శకులకు కూడా ఇతర సినిమాలు చేసుకోడానికి స్వేచ్ఛనిచ్చాడు. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తిగా ఆపేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల తర్వాత ఈ సినిమా మళ్లీ సెట్స్‌పైకి రానుంది.

అప్పటి వరకు హోల్డ్‌లోనే ఉండబోతున్నాడు ఉస్తాద్. మరోవైపు క్రిష్, సుజీత్ పరిస్థితి కూడా ఇంతే. అందుకే వాళ్లు వేరే హీరోలను చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ కూడా రవితేజతో సినిమాకు దాదాపు ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. ఈ మధ్యే అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగింది.

డిసెంబర్ ఫస్ట్ వీక్‌లోనే రవితేజ, హరీష్ శంకర్ సినిమా మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అనుమతి తీసుకున్నాకే.. రవితేజ సినిమాపై హరీష్ ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తుంది. నిజానికి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉన్నా.. హరీష్ శంకర్ మాత్రం ఖండిస్తూనే ఉన్నాడు.

అందులో ఎలాంటి నిజం లేదు.. పవన్ సినిమా నుంచి పక్కకెళ్లే ముచ్చటే లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ అధికారికంగా రవితేజ సినిమాపై కన్ఫర్మేషన్ లేదు కానీ పక్కా ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది. రవితేజ హీరోగా వచ్చిన షాక్ సినిమాతోనే దర్శకుడిగా మారాడు హరీష్ శంకర్. అది ఫ్లాప్ అవ్వడంతో.. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేసాడు.

ఆ తర్వాత మిరపకాయ్‌తో మరోసారి డైరెక్టర్‌గా హరీష్‌కు రీ బర్త్ ఇచ్చాడు రవితేజ. అప్పట్నుంచి ఈయన దశ మారిపోయింది. గబ్బర్ సింగ్‌తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. రామయ్యా వస్తావయ్యా ఫ్లాపైనా.. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్, డిజే లాంటి సినిమాలతో మినిమమ్ గ్యారెంటీ ముద్ర వేసుకున్నాడు.

మూడేళ్లుగా ఉస్తాద్‌తోనే బిజీగా ఉన్న హరీష్‌కు ఇప్పుడు ఎన్నికలు శాపంగా మారాయి. దాంతో పవన్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి.. రవితేజతో మిరపకాయ్ 2 లాంటి పక్కా యాక్షన్ సినిమా చేయాలని చూస్తున్నాడు. దీనికోసమే ప్రయత్నాలు మొదలయ్యాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.




