Ashu Reddy: హాట్ ఎక్స్‌ప్రెషన్లతో కుర్రకారును అట్రాక్ట్ చేస్తున్న అషు రెడ్డి.. పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
బుల్లితెర బ్యూటీ అషూరెడ్డి ప్రస్తుతం పలు టీవీ షోలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈటీవీలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఫ్యామిలీ స్టార్స్ షోలో చేస్తుంది అషూరెడ్డి. అయితే గతేడాది అషూకి బ్రెయిన్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఆమె కొన్నాళ్ల పాటు బయటికి కూడా రాలేదు. కానీ దాని నుంచి పూర్తిగా కోలుకొని ఈ ఏడాదే కెమెరా ముందుకు వచ్చింది.
Updated on: May 11, 2025 | 10:34 AM

బుల్లితెర బ్యూటీ అషురెడ్డి గ్లామర్ షో విషయంలో అస్సలు వెనుకాడదు. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ… అప్పట్లో జూనియర్ సమంతగా వార్తల్లో నిలిచేది.

అషు రెడ్డి స్వస్థలం విశాఖపట్నం అయినా తండ్రి ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడింది. అయితే అమెరికాలో స్థిరపడినా ఆమెకు నటన మీద ఉన్న మక్కువతో ఇండియా కు వచ్చేసింది.

ఎలా అయినా సినీ పరిశ్రమలో వెలిగిపోవాలని హైదరాబాద్ వచ్చిన ఆమె తెలుగులో ఛల్ మోహన రంగ లో మేఘా ఆకాష్ కు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఈమె కొంచెం బొద్దుగా మారిపోయింది.

గేమ్ అంతంత మాత్రంగా ఆడినా.. ఎక్కువ రోజులే హౌస్ లో ఉండగలిగింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక ఏం చేసిందో ఏమో బాగా స్లిమ్ అయ్యింది. ఓ పక్క బుల్లితెరపై షోలలో పాల్గొంటూనే మరోపక్క తన యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు చేస్తూ వస్తోంది.

రీసెంట్ గా ఈమెకు బ్రెన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. వాటి పై సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక అషు రెడ్డి ఆ మధ్య తరచుగా దుబాయ్ ఈవెంట్స్ కు వెళ్తూ సందడి చేస్తూ కనిపించింది.. తాజాగా మెరుపుల డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచేసింది.




