Amitab Bachchan: అమితాబ్ దూకుడుకు కుర్ర హీరోలు షాక్
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.. కానీ ఇక్కడ ఓల్డ్ ఈజ్ డైమండ్ అనిపిస్తుంది అమితాబ్ బచ్చన్‌ను చూస్తుంటే..! వయసు 80 దాటిన తర్వాత కూడా ఈయన స్టార్ డమ్ చూస్తుంటే కుర్ర హీరోలు కూడా కుళ్లుకోక తప్పదు. తాజాగా మరో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసారు బిగ్ బి. వారం రోజులకు 25 కోట్లు వసూలు చేస్తున్నారు. మరి అదేంటో చూద్దామా..?
Updated on: Jul 20, 2025 | 9:11 PM

అమితాబ్ బచ్చన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమా చెప్పండి..? ఆయన పేరే ఓ బ్రాండ్..! కొన్నేళ్ళ కింది వరకు కేవలం హిందీలోనే నటించిన అమితాబ్ జీ.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఓకే అంటున్నారు.

మరీ ముఖ్యంగా తెలుగుపై ఒకింత ఎక్కువ ప్రేమనే చూపిస్తున్నారు. ఇక హిందీలో సినిమాలతో పాటు టెలివిజన్‌పైనా సత్తా చూపిస్తున్నారీయన. తెలుగులో మనం, సైరా, కల్కి లాంటి సినిమాల్లో నటించారు అమితాబ్.

తాజాగా విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రీత్యన్ సినిమాలో కీలక పాత్ర కోసం అమితాబ్ పేరు వినిపిస్తుంది. 1850ల నాటి కథ ఇది.. ఇందులో బిగ్ బి కోసం డిఫెరెంట్ క్యారెక్టర్ రాహుల్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సినిమాలు పక్కన బెడితే.. KBC సీజన్ 17తో హోస్టుగా రాబోతున్నారు బిగ్ బి.

కౌన్ బనేగా కరోడ్‌పతి అంటే వెంటనే గుర్తుకొచ్చేది అమితాబ్ బచ్చనే. కొత్త సీజన్ కోసం వారానికి ఏకంగా 25 కోట్లు ఛార్జ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అంటే ఎపిసోడ్‌కు 5 కోట్లు తీసుకోబోతున్నారు అమితాబ్.

గతంలో బిగ్‌బాస్ ఓటిటి కోసం ఎపిసోడ్‌కు 4 కోట్లు తీసుకున్నారు సల్మాన్.. ఇప్పుడు దాన్ని క్రాస్ చేస్తున్నారు బిగ్ బి. మొత్తానికి 83 ఏళ్ళ వయసులోనూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు బాలీవుడ్ మెగాస్టార్.




