- Telugu News Photo Gallery Cinema photos Along with films, the director also covers web series in spare time
Directors: డిజిటల్ ప్లస్ థియేటర్స్‌ను కవర్ చేస్తున్న కెప్టెన్స్.. ఆ దర్శకులెవరంటే..?
ఈ రోజుల్లో దర్శకులు కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఖాళీగా ఉన్నపుడు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ డైరెక్టర్స్ చూపు కూడా డిజిటల్‌పై పడుతుంది. ఓ వైపు రెండు మూడేళ్లకో సినిమా చేస్తూనే.. ఓటిటిలో రెగ్యులర్‌గా వెబ్ సిరీస్‌లు క్రియేట్ చేస్తున్నారు. మరి డిజిటల్ ప్లస్ థియేటర్స్‌ను కవర్ చేస్తున్న ఆ దర్శకులెవరు..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Feb 06, 2024 | 3:14 PM

తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్‌ల ట్రెండ్ బాగా పెరిగిపోతుంది. వాటికి వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత స్టార్ డైరెక్టర్స్ చూపులు కూడా వాటిపై పడుతున్నాయి. అందుకే వాళ్లే షో రన్నర్స్‌గా మారిపోతున్నారు. ఈ మధ్యే విక్రమ్ కే కుమార్ దూత వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్నారు. ఈ సిరీస్‌తోనే నాగ చైతన్య ఓటిటి ఎంట్రీ ఇచ్చారు.

క్రిష్ సైతం సినిమాలు చేసినా చేయకపోయినా.. వెబ్ సిరీస్‌లు మాత్రం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈయన ఖాతాలో 9 హవర్స్, మస్తీస్ లాంటి సిరీస్‌లు ఉన్నాయి.

ఇక హరీష్ శంకర్ సైతం సన్నీ హీరోగా నటించిన ATM షోకు బ్యాక్ బోన్‌గా ఉన్నారు. వీళ్లే కాదు.. మహి వి రాఘవ్, సంపత్ నంది, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు కూడా అప్పుడప్పుడూ వెబ్ సిరీస్‌లు చేసిన వాళ్లే.

తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో లెజెండరీ దర్శకులు కూడా వెబ్ సిరీస్‌ల వైపు వచ్చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ డికే ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి సిరీస్‌లతో ఇండియన్ ఓటిటి స్వరూపాన్నే మార్చేసారు.

సంజయ్ లీలా భన్సాలీ సైతం తాజాగా హీరామండి అనే సిరీస్ చేస్తున్నారు.. ఈ మధ్యే ఇండియన్ పోలీస్ ఫోర్స్‌తో రోహిత్ శెట్టి డిజిటల్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి దర్శకులకు డిజిటల్ మార్కెట్ ఇప్పుడు బంగారు బాతులా మారిపోయింది.





























