మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni). ఇప్పుడు ఏజెంట్ (Agent)గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి (Surender Reddy) ఈ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.