Sreeleela: పచ్చని పొలాల్లో పడుచు కోకిల.. శ్రీలీల అందానికి ప్రకృతి కూడా ప్రేమలో పడాల్సిదే
ఈ మధ్య శ్రీలీల కూడా తన గ్లామర్ తో కుర్రాళ్లను ఆకర్షిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంటపొలాల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది. పచ్చని పంటపొలాల మధ్య చీరకట్టుకొని కొన్ని క్రేజీ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది శ్రీలీల.
Updated on: Nov 05, 2024 | 1:35 PM

దర్శకేద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార శ్రీలీలా. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది.

ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ వరుసగా అవకాశాలు అందుకుంది. ధమాకా, స్కంద, ఆదికేశవర, ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం ఇలా అన్ని పెద్ద సినిమాల్లో నటించింది. అయితే ఈ బ్యూటీకి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు.

ధమాకా సినిమా హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ అంతా మాస్ రాజాకే వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఉస్తాద్ భగ్ సింగ్‌తో పాటు రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాల పైనే శ్రీలీల బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

ఉస్తాద్ భగ్ సింగ్, రాబిన్ హుడ్ ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా.. శ్రీలీల కెరీర్ మళ్లీ స్పీడ్ అందుకుంటుంది. సినిమాలతో పాటు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను కవ్విస్తుంది.

ఈ మధ్య శ్రీలీల కూడా తన గ్లామర్ తో కుర్రాళ్లను ఆకర్షిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంటపొలాల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది. పచ్చని పంటపొలాల మధ్య చీరకట్టుకొని కొన్ని క్రేజీ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది శ్రీలీల.





























