Rajeev Rayala |
Updated on: Nov 05, 2024 | 1:29 PM
అందాల భామ సమంత సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఎప్పుడెప్పుడు తిరిగి సినిమాలు చేస్తుందా అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సామ్ హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
అలాగే తెలుగులోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యింది ఈ వయ్యారి భామ. ఇక సమంత ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ తన సిరీస్ ను ప్రమోట్ చేసుకుంటుంది ఈ బ్యూటీ.
అప్పట్లో ఫ్యామిలీమేన్2 క్లిక్ అయినట్టుగానే ఇప్పుడు సిటాడెల్ హిట్ కావాలి. అంతే కాదు, ఆల్రెడీ ఇదే థీమ్‌తో చేసిన ప్రియాంక చోప్రాని మ్యాచ్ చేయగలగాలి.
బరువు గురించి ఎందుకు.? నేను ఇప్పుడు ఉన్న కండీషన్, మెయింటైన్ చేసే డైట్‌కి ఇలానే ఉంటాను.. నేను బరువు పెరగను. మీది మీరు చూసుకోండి. ఎదుటివారిని జడ్జ్ చేయకండి అని సీరియస్ అయ్యింది సమంత.
అసలే బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఈ మాత్రం గ్లామర్ షో తప్పదులే అని అంటున్నారు ముంబైవాలాస్.