- Telugu News Photo Gallery Cinema photos Actress Sobhita Dulipala Shares Wedding Photos With Naga Chaitanya
Sobhita – Naga Chaitanya: పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన శోభిత.. భర్తపై పొగడ్తల వర్షం కురిపించిన హీరోయిన్..
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరి పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోలో జరగ్గా.. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా తన పెళ్లి ఫోటోస్ షేర్ చేసింది శోభిత.
Updated on: Dec 08, 2024 | 8:54 PM

అక్కినేని నాగచైతన్య ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు చైతూ.

అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా పెళ్లి ఫోటోస్ షేర్ చేసింది శోభిత.

చైతన్యలాంటి వ్యక్తి తనకు భర్తగా రావడం తన అదృష్టమని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. చైతూ సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉండడం తనను ఆకట్టుకున్నాయని తెలిపింది.

అలాగే చైతూ హుందగా ప్రవర్తించడం తనకు నచ్చిందని.. తనను ఎంతగానో ప్రేమిస్తాడని.. చాలా బాగా చూసుకుంటాడని భర్త నాగచైతన్య పై పొగడ్తల వర్షం కురిపించింది.

అలాగే ఇటీవల రానా దగ్గుబాటి షోలో పాల్గొన్న చైతన్య తన వైవాహిక జీవితం గురించి మాట్లాడాడు. తనకు ఒకరిద్దరు పిల్లలు చాలని అన్నాడు. చిన్నతనంలో తాను గడిపిన మధుర క్షణాలను వాళ్లతో తిరిగి పొందాలనుకుంటున్నట్లు తెలిపాడు.

తనకు 50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో మధ్యలో రానా కలుగజేసుకుని వెంకీమామల ముగ్గురు, నలుగురు కావాలా అని అడగ్గా.. ఒకరిద్దరు చాలు అన్నాడు చైతన్య.

కొడుకు పుడితే తనను రేస్ ట్రాక్ కు తీసుకెళ్తానని.. కూతురు పుడితే తనకు ఎలాంటి హాబీలు ఉంటాయో గుర్తించి ప్రోత్సహిస్తానని.. తనకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉందని అన్నాడు చైతన్య.




