- Telugu News Photo Gallery Cinema photos Actress Nabha Natesh Share Beautifull Black and White Photos Goes Viral
Nabha Natesh: నిశీధిలో ఉషోదయంలా.. చిరునవ్వుతో మాయ చేస్తోన్న నభా.. ఫోటోస్ వైరల్..
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేస్తుంటుంది హీరోయిన్ నభా నటేశ్. కొన్నాళ్లుగా సినీరంగంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు నెట్టింట సైతం తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నిఖిల్ జోడిగా స్వయంభు చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
Updated on: Jul 04, 2025 | 1:45 PM

తెలుగు సినీరంగంలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లలో నభా నటేశ్ ఒకరు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ డమ్ అందుకుంటుందని అనుకున్నారు. కానీ అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా విశ్రాంతి తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. కథ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది.

ఇటీవలే డార్లింగ్ సినిమాతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు వచ్చిన ప్రతిసినిమాకు ఈ బ్యూటీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ షేర్ చేసింది. ఇందులో మరింత అందంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. నభా నటేశ్ కమిట్ అయిన సినిమాలు ఏమి లేదు. కేవలం ఈ అమ్మడు చేతిలో స్వయంభు సినిమా మాత్రమే ఉన్నట్లు సమాచారం. అలాగే తెలుగుతోపాటు కన్నడలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటుందట.

కర్ణాటకలోని శృంగేరిలో జన్మించిన నభా నటేశ్.. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ బెలవాడి శిష్యురాలిగా ఎన్నో నాటకాల్లో నిటంచింది. స్కూల్ డేస్ లోనే భరతనాట్యం నేర్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.




