Basha Shek |
Updated on: Oct 02, 2024 | 6:35 PM
భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఇలా దేశంలోని సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా ఐఫాలో సందడి చేశారు.
సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు మొత్తం మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో వివిధ విభాగాల్లో నటీనటులకు పురస్కారాలు ప్రదానం చేశారు
ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ సీనియర్ నటి మీనా కూడా పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా బ్లాక్ కలర్ డ్రెస్ లో ముస్తాబైందీ అందాల తార.
కాగా అక్కడి జర్నలిస్టుల్లో ఒకరు మీనాని హిందీలో మాట్లాడమని కోరగా 'ఇది హిందీ సినిమా పండగ కాదు' అంటూ స్ట్రాంగ్ పంచ్ ఇచ్చింది.
'నేను సౌత్ ఇండియన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అటు నార్త్ ఇండియన్, ఇటు సౌత్ ఇండియన్ సినిమా ప్రపంచాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చినందుకు ఐఫాకు ధన్యవాదాలు' అని చెప్పుకొచ్చింది మీనా