Madonna Sebastian: మతోపోగొడుతున్న మడోనా.. మలయాళీ ముద్దుగుమ్మ వయ్యారాలు అదుర్స్
నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గానటించింది . ఈ సినిమాలో లాయర్ పాత్రలో మెరిసింది ఈ అమ్మడు. ఆతర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తున్న మడోనా ఓ వైపు సంప్రదాయబద్ధంగా..
Updated on: Jan 20, 2025 | 1:15 PM

మడోన్నా సెబాస్టియన్.. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆతర్వాత ఎక్కువ ఆఫర్స్ అందుకోలేకపోయింది.

తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు కానీ తమిళ్ లో మలయాళంలో ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం మలయాళం, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది. తెలుగులో చివరిగా నాని సినిమాలో కనిపించింది.

నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గానటించింది . ఈ సినిమాలో లాయర్ పాత్రలో మెరిసింది ఈ అమ్మడు. ఆతర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తున్న మడోనా ఓ వైపు సంప్రదాయబద్ధంగా చీరకట్టులో కనిపిస్తూనే మరో వైపు మోడ్రన్ డ్రస్ లో మెరుస్తుంది. అలాగే అందాలతో అభిమానులను కవ్విస్తుంది ఈ కుర్రాది.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. సూపర్ స్టైలిష్ లుక్ లో కేక పెట్టించింది మడోనా. ఈ అమ్మడి ఫోటోలకు కుర్ర కారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొంతమంది కవితలు కూడా రాస్తున్నారు.




