ఫ్యాన్స్‌ను కన్ఫూజన్‌లో పడేస్తున్న స్టార్ హీరో.. ఎందుకంటే?
సాధారణంగా స్టార్ హీరోలు సినిమాలు చేయకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటారు.. వాళ్ల నుంచి రెండేళ్ల గ్యాప్ వచ్చినా బాబోయ్ అంటూ నిట్టూరుస్తుంటారు. అలాంటిది ఓ స్టార్ హీరో నుంచి అసలు సినిమాలు వస్తాయో రావో అనే కన్ఫ్యూజన్ మొదలైంది. ప్యాషన్ కోసం ప్రొఫెషన్‌ను పక్కనబెట్టేలా కనిపిస్తున్నారు ఆ హీరో.
Updated on: Jan 20, 2025 | 2:09 PM

సాధారణంగా స్టార్ హీరోలు సినిమాలు చేయకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటారు.. వాళ్ల నుంచి రెండేళ్ల గ్యాప్ వచ్చినా బాబోయ్ అంటూ నిట్టూరుస్తుంటారు. అలాంటిది ఓ స్టార్ హీరో నుంచి అసలు సినిమాలు వస్తాయో రావో అనే కన్ఫ్యూజన్ మొదలైంది. ప్యాషన్ కోసం ప్రొఫెషన్‌ను పక్కనబెట్టేలా కనిపిస్తున్నారు ఆ హీరో.

అజిత్ చేస్తున్న పనులు చూస్తుంటే అభిమానులకు మినీ హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది. ఈయన సినిమాల కంటే కూడా ఇప్పుడు రేసింగ్‌లపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ప్యాషన్ కోసం ప్రొఫెషన్‌కు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు అజిత్. బ్రేక్ అయితే పర్లేదు కానీ ఫుల్ స్టాప్ అయితేనే అసలు సమస్య అంటున్నారు ఫ్యాన్స్.

కొన్ని రోజులుగా అజిత్ ఫోకస్ అంతా రేసింగ్‌పైనే ఉంది. దుబాయ్‌లోని రేసింగ్ ఛాంపియన్ షిప్‌లో అజిత్ కూడా పాల్గొంటున్నారు. అంతేకాదు.. అందులో జరిగిన 24 గంటల దుబాయ్-2025 అంతర్జాతీయ కార్ రేస్‌లో మూడో స్థానంలో నిలిచింది అజిత్ కుమార్ టీం. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

జిత్ స్పీడ్ చూస్తుంటే సినిమాలు ఆపేసి పూర్తిస్థాయి రేసర్ అయ్యేలా కనిపిస్తున్నారు. ముందు నుంచీ సినిమాలతో పాటు రేసింగ్‌కు టైమ్ ఇచ్చిన అజిత్.. ఇప్పుడు సినిమాల కంటే రేస్‌లకే ఎక్కువ టైమ్ ఇస్తున్నారు.

అంతే కాదు రేసులు లేని సమయంలోనే సినిమాలు చేస్తానంటూ ఓపెన్‌గానే ప్రకటించారు ఈ హీరో. ఈ లెక్కన అజిత్ నుంచి ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు ఊహించలేం.