- Telugu News Photo Gallery Cinema photos Actress Krithi Shetty beautiful looks in lehanga photos goes viral telugu cinema news
Krithi Shetty: గ్లామర్ డోస్ పెంచేస్తోన్న బేబమ్మ.. లెహాంగాలో కృతి శెట్టి హోయలు..
ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి దూసుకొచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాతోనే బ్యూటీ క్రేజ్ మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్స్ అందుకున్న కృతి.. ఆ తర్వాత వరుసగా ప్లాపులను ఖాతాలో వేసుకుంది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి.
Updated on: Jun 03, 2023 | 8:22 PM

ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి దూసుకొచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాతోనే బ్యూటీ క్రేజ్ మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది.

బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్స్ అందుకున్న కృతి.. ఆ తర్వాత వరుసగా ప్లాపులను ఖాతాలో వేసుకుంది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి.

ఇటీవలే కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం కృతి తెలుగులో శర్వానంద్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. అలాగే.. తమిళంలో విశాల్ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇవే కాకుండా.. మలయాళంలో రూపొందుతున్న ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తుంది కృతి శెట్టి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.

తాజాగా లెహాంగాలో అందంగా ముస్తాబయిన ఫోటోస్ షేర్ చేసింది. అంతేకాకుండా.. రోజు రోజుకీ గ్లామర్ డోసు పెంచేసింది.




