- Telugu News Photo Gallery Cinema photos Actress Ivana says her friends used to tease her about her height during her school days
పొట్టి అంటూ ఏడిపించే వారు.. షాకింగ్ విషయం చెప్పిన యంగ్ బ్యూటీ ఇవానా
లేటెస్ట్ సెన్సేషన్ ఇవానా.. ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తమిళ్ లో లవ్ టుడే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇవానా రీసెంట్ గా సింగిల్ సినిమా చేసింది.
Updated on: Aug 19, 2025 | 9:31 PM

లేటెస్ట్ సెన్సేషన్ ఇవానా.. ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తమిళ్ లో లవ్ టుడే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇవానా రీసెంట్ గా సింగిల్ సినిమా చేసింది.

శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా రీసెంట్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఇవానా తన అందంతో పాటు నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది ఇవానా. ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి తెలుగులో క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

ఇదిలా ఉంటేగతంలో ఓ ఇంటర్వ్యూలో ఇవానా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. చిన్నతనంలో హైట్ విషయంలో చాలా మంది ఏడిపించేవారు అని తెలిపింది. చిన్నప్పుడు నేను హైట్ తక్కువగా ఉండటంతో చాలా అవమానాలు, రిజక్షన్స్ ఎదుర్కొన్నా. స్కూల్‌లో నన్ను ఫ్రెండ్స్ ‘పొట్టి’ అని ఏడిపించేవారు అని తెలిపింది.

వాళ్ల మాటలు చాలా బాధపెట్టేవి దాంతో నేను చదువు పై పెద్దగా దృష్టి పెట్టలేకపోయాను అని తెలిపింది. ఇక చిన్న వయసునుంచే సినిమాల పై ఇంట్రెస్ట్ ఉండేది అని చెప్పుకొచ్చింది. ఇవానాకు తెలుగులో ‘హ్యాపీడేస్’ అంటే చాలా ఇష్టమట. ఈ సినిమా సాంగ్స్ తన ఫెవరెట్ అని తెలిపింది అని చెప్పుకొచ్చింది.. అలాగే ఫేవరెట్ హీరో అల్లు అర్జున్.

ఇక ఈ చిన్నదనికి ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన ఫొటోలతో ఆకట్టుకుంటుందీ అందాల తార.