- Telugu News Photo Gallery Cinema photos Actress Anupriya Goenka Recalls Co Star Got Excited During Intimate Scene felt Violated
Tollywood: ఆ హీరో వద్దన్నా అక్కడ పట్టుకున్నాడు.. ముద్దు సీన్లలో రెచ్చిపోయాడు.. నటి షాకింగ్ కామెంట్స్..
సాధారణంగా సినీరంగంలో హీరోయిన్లకు ఎన్నో కఠినపరిస్థితులు ఎదురవుతుంటాయి. పలు సీన్లలో నటించేందుకు నటీమణులు చాలా ఇబ్బందిపడతారు. అలాగే సెట్ దర్శకనిర్మాతలు, కో ఆర్టిస్టులు, ప్రొడక్షన్ సభ్యుల ప్రవర్తనతో విసిగిపోతుంటారు. ఇప్పుడిప్పుడే పలువురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు ఘటనలను బయటపెడుతున్నారు.
Updated on: Apr 03, 2025 | 1:53 PM

పాంచాలి, అసుర్ లాంటి వెబ్ సిరీస్ ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనుప్రియా గోయెంకా. ఇటీవల సిద్ధార్థ్ కన్నన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ. తనతో పలువురు కోస్టార్స్ ఇబ్బందికరంగా వ్యవహరించారో చెప్పుకొచ్చింది.

తనకు రెండుసార్లు ఇలా జరిగిందని.. తొలిసారి ముద్దు సన్నివేశంలో నటిస్తున్న సమయంలో తనతోపాటు నటించే కోఆర్టిస్ట్ దానిని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో అతడిలో ఉత్సాహం ఎక్కువైందని తెలిపింది.

ముద్దు సన్నివేశంలో నటిస్తున్న సమయంలో ఆ నటుడు తన నడుముపై చేతులు వేయకుండా తన పిరుదులపై వేశాడని తెలిపింది. ఆ తర్వాత తాను అతడి చేయి పట్టుకుని నడుముపై ఉంచానని.. అంతకంటే కింద పట్టుకోవద్దని చెప్పినట్లు గుర్తుచేసింది.

కానీ అతడు ఏమాత్రం పట్టించుకోకుండా రెండుసార్లు అలాగే చేశాడని తెలిపింది. అతడు అలా పట్టుకున్నప్పుడు మాత్రం తనకు చాలా బాధేసిందని.. ఎందుకు అలా చేశావని తాను అడగలేదని తెలిపింది.

ఎందుకంటే అలా అడిగితే పొరపాటున జరిగిందని చెబుతాడని.. అప్పుడు అతడిని తిట్టలేనని.. కానీ తర్వాతి టేక్ లో ఇలా జరగకూడదని గట్టిగా చెప్పానని తెలిపింది.




