Sathyaraj: నటుడు సత్య రాజ్ ఇంట విషాదం.. సినీ ప్రముఖల సంతాపం
తెలుగులోనూ ఆయన పలు సినిమాల్లో నటించారు. కానీ బాహుబలి సినిమా ఆయన రేంజ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. కట్టప్పగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలో సత్యరాజ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. హీరోలకు తండ్రిగా ఆయన పలు సినిమాల్లో నటిస్తున్నారు.
Updated on: Aug 12, 2023 | 11:53 AM

విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్య రాజ్. తమిళ్ లో ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అక్కడ రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగులోనూ ఆయన పలు సినిమాల్లో నటించారు. కానీ బాహుబలి సినిమా ఆయన రేంజ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. కట్టప్పగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బాహుబలి సినిమాలో సత్యరాజ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. హీరోలకు తండ్రిగా ఆయన పలు సినిమాల్లో నటిస్తున్నారు.

తాజాగా సత్య రాజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సత్య రాజ్ తల్లి కన్నుమూశారు.

సత్యరాజ్ తల్లి నాదాంబల్ కాలియంగార్ కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్ళు. ఆమె చనిపోయిన సమయంలో సత్యరాజ్ హైదరాబాద్ లో ఓ షూటింగ్ లో ఉన్నారట. సత్య రాజ్ తల్లి మరణించడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.




