AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Vs Eggs: చికెన్ వర్సెస్ గుడ్లు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

ఈ మధ్యకాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి ఆహారంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల చాలా మంది చికెన్, గుడ్లు వంటి ప్రొటీన్ వనరులను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది ఉత్తమమైన ఎంపిక అనే విషయంలో చాలా మందికి సందేహం ఉంటుంది.

Krishna S
|

Updated on: Nov 16, 2025 | 8:13 PM

Share
చికెన్ లీన్ ప్రోటీన్‌కు అత్యుత్తమ వనరు. అందుకే కండరాల నిర్మాణాన్ని, బరువు నిర్వహణను లక్ష్యంగా చేసుకునే వారికి ఇది అనుకూలమైన ఆహారం. చికెన్‌లో ఉండే అధిక ప్రోటీన్ కండరాల పెరుగుదలకు, జీవక్రియ పనితీరుకు చాలా అవసరం.

1 / 5
చికెన్‌లో నియాసిన్, విటమిన్ B6 వంటి B విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తి జీవక్రియ, మెదడు, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తాయి. ఇందులో సెలీనియం, పాస్పరస్ కూడా ఉంటాయి. ఇవి థైరాయిడ్ ఆరోగ్యం, కణాల ఆరోగ్యం, ఎముకల బలానికి మంచివి.

2 / 5
చికెన్‌తో పోలిస్తే గుడ్లలో ప్రోటీన్ కొద్దిగా మితమైన మొత్తంలో మాత్రమే ఉంటుంది. కానీ గుడ్లు సంపూర్ణ పోషకాల నిలయంగా నిలుస్తాయి. గుడ్లలో కోలిన్, లుటిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడు, కంటి, జీవక్రియ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

3 / 5
గుడ్డు పచ్చసొనలో విటమిన్లు A, D, E, K, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. బరువు తగ్గాలనుకునే వారు తమ అల్పాహారంలో గుడ్లను చేర్చుకోవడం చాలా మంచిది. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతాయి.

గుడ్డు పచ్చసొనలో విటమిన్లు A, D, E, K, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. బరువు తగ్గాలనుకునే వారు తమ అల్పాహారంలో గుడ్లను చేర్చుకోవడం చాలా మంచిది. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతాయి.

4 / 5
 నిపుణుల ప్రకారం.. చికెన్, గుడ్లు రెండింటిలోనూ బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. వీటిని ఎంచుకోవడం మీ లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. మీ లక్ష్యం లీన్ ప్రోటీన్, కండరాల అభివృద్ధి అయితే మీరు చికెన్‌ను ఎంచుకోవచ్చు. మీ లక్ష్యం పోషకాలతో కూడిన అల్పాహారం, మెదడు ఆరోగ్యం అయితే మీరు గుడ్లను ఎంచుకోవచ్చు.ఈ రెండింటినీ సమతుల్యంగా మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఆరోగ్యకరమైన ఫలితాలను పొందవచ్చు.

5 / 5