- Telugu News Photo Gallery Chanakya Niti These 3 things including education and wealth people come by getting them written in advance
Chanakya Niti: విధిరాతే ఫైనల్.. జనన, మరణాల గురించి ఆచార్య చాణక్యుడు ఏమన్నాడంటే..?
ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన పలు విషయాల గురించి ప్రస్తావించాడు. అందుకే విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరని పెద్దలు పేర్కొంటుంటారు.
Updated on: Jun 03, 2022 | 4:00 PM

ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు.. ఉన్నత స్థానంలో ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే.. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణుక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

పూర్వ జన్మ కర్మను బట్టి మన విధి ఉంటుందని మన గ్రంధాలలో పేర్కొన్న విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితిలో జీవితంలో ఏం జరిగినా పుట్టకముందే నిర్ణయించబడుతుంది. ఆచార్య చాణక్యుడు కూడా అలాంటిదే విశ్వసించాడు. ఈ విషయంలో చాణక్య నీతి ఏం చెబుతుందో తెలుసుకోండి.

ఆచార్య చాణక్యుడు ప్రస్తుత జీవితంలో ఒక వ్యక్తికి సుఖం, దుఃఖం లభించినా.. అవి అతని పూర్వ జన్మ కర్మల ఫలితమని పేర్కొన్నాడు. ఒక వ్యక్తి మంచి పనులు చేయడం ద్వారా తన భవిష్యత్తును మార్చుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు ముందుగానే నిర్ణయమవుతాయి. అవి అదృష్టం అయినా.. దురదృష్టం అయినా..ఈ విషయాల గురించి తెలుసుకోండి.

వయస్సు: బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు.. అతని విధి మాత్రమే రాయబడుతుంది. అదే సమయంలో అతను సమాజంలో ఎంత వయస్సు వరకు జీవిస్తాడో నిర్ణయమవుతంది. అందుచేత మీకు ఏ జీవితం లభించినా మీరు దానిని పూర్తి ఆనందంతో జీవించాలి. ఎల్లప్పుడూ మంచిని పంచడానికి ప్రయత్నించాలి.

మరణం: మనిషి ఎంత ప్రయత్నించినా మరణం నుంచి తప్పించుకోలేడు. ప్రతి వ్యక్తి మరణించే తేదీ, సమయం కూడా రాయబడుతుంది. ఆ నిర్ణీత సమయంలో అతడు లోకాన్ని విడిచి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి నిర్భయంగా జీవించండి. నీ మరణ సమయం వచ్చే వరకు ఎవరూ కూడా మీకు హాని చేయలేరు.




