AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: శత్రువు పిల్లలకు తల్లైన కోడి .. హృదయానికి హత్తుకుంటున్న ఫోటో

సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు, జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఫోటో ఒకటి వైరల్(Viral Photo)గా మారింది.

Viral Photo: శత్రువు పిల్లలకు తల్లైన కోడి .. హృదయానికి హత్తుకుంటున్న ఫోటో
Hen
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2022 | 3:43 PM

Share

సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు, జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఫోటో ఒకటి వైరల్(Viral Photo)గా మారింది. అది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇదికదా మానవత్వం అంటున్నారు.. వాస్తవానికి, వైరల్ చిత్రంలో, తుఫాను సమయంలో ఒక కోడి రెండు పిల్లులని రక్షించడాన్ని చూడవచ్చు. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత, ఆపద సమయంలో మనుషులకే కాదు, జంతువులు, పక్షులు కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదని కొందరు అంటున్నారు.

ఈ చిత్రాన్ని మైక్రో-బ్లాగింగ్ సైట్ Twitterలో Buitengebieden అనే ఖాతాతో షేర చేశారు. ఇది ఎందరో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వైరల్‌గా మారిన చిత్రంలో, కోడి తన ఈకలతో పిల్లి పిల్లలను ఎలా కాపాడుతోందో మీరు చూడవచ్చు. అది తన కోడిపిల్లలకు చేసినట్లే పిల్లి పిల్లలను అక్కున చేర్చుకుంది. తుఫాను సమయంలో భయంతో కోడి రెండు పిల్లుల సంరక్షణను తీసుకుంటోంది’ అని రాశారు. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్‌ను 1 లక్ష 67 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో, వెయ్యి మందికి పైగా కామెంట్‌ చేశారు. ఇది కాకుండా, 19 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.