- Telugu News Photo Gallery Central government digitisation drive removes 58 million fake ration cards from PDS Details Here
Ration Cards: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. 5.8 కోట్ల రేషన్ కార్డుల తొలగింపు.. కారణం ఏంటంటే..
రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కోవిడ్ సమయం నుంచి ఇప్పటివరకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఉచితంగా రేషన్ అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రేషన్ కార్డులను రద్దు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది
Updated on: Nov 21, 2024 | 1:47 PM

రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కోవిడ్ సమయం నుంచి ఇప్పటివరకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఉచితంగా రేషన్ అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రేషన్ కార్డులను రద్దు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. వన్ నేషన్.. వన్ రేషన్ అనే నినాదాన్ని తీసుకువచ్చిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన పేదలు ఎక్కడైనా ఆహార ధాన్యాలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే..

అర్హులకే ఆహార ధాన్యాలు అందేలా పకడ్బంధీగా చర్యలు తీసుకుంటోంది.. దీనికోసం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) ను డిజిటలైజేషన్ చేసింది.. అంతేకాకుండా ఈపీఓఎస్ యంత్రాలను కూడా సమకూర్చింది.. ఈ క్రమంలోనే నకిలీ రేషన్ కార్డులను ఏరివేసింది.. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా PDS వ్యవస్థలో నకిలీలను నివారించేందుకు చర్యలు చేపట్టింది.

డిజిటైజేషన్ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని, తద్వారా ఆహార భద్రతలో ప్రపంచానికే దిశానిర్దేశం చేసినట్లయిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. పీడీఎస్ వ్యవస్థ ద్వారా దేశంలో మొత్తంగా 80.6కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతుండగా.. ఆధార్ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించనట్లు మోదీ ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. PDS లో ప్రభుత్వ డిజిటలైజేషన్ డ్రైవ్ ద్వారా భారీ సంఖ్యలో నకిలీ రేషన్ కార్డులను గుర్తించినట్లు తెలిపింది.

కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్పటివరకు 20.4కోట్ల రేషన్ కార్డుల డిజిటలైజేషన్ పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా 5.33 లక్షల రేషన్ దుకాణాలకు ఇ-పోస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో 99.8శాతం కార్డులను ఆధార్‌తో ఆనుసంధానం చేయగా.. బయోమెట్రిక్ ప్రమాణీకరణతో 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయినట్లు తెలిపింది.. అంతేకాకుండా.. ఈ కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియతో ఇప్పటివరకు 64శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిపింది.

నకిలీ రేషన్ కార్డుల ఏరివేత, అదే విధంగా నాణ్యత లో ఏమాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.. ఆహార పదార్థాల సరఫరా విషయంలోనూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పకడ్బందీగా వ్యవహరిస్తోందని తెలిపింది.. సరకు రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌నూ రైల్వేలతో అనుసంధానించామని పేర్కొంది..





























