- Telugu News Photo Gallery Can people with sugar drink tea? How to drink if you drink? check here is details in Telugu
Tea for Diabetes: షుగర్ ఉన్నవాళ్లు టీ తాగవచ్చా.. తాగితే ఎలా తాగాలి?
షుగర్ ఉన్నవాళ్లు ఆహార విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటివి తీసుకుంటే ఏం జరుగుతుందో ముందే గమనించు కోవాలి. ఏది పడితే అది.. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. ఈ క్రమంలోనే షుగర్ పేషెంట్లు టీ తాగవచ్చా? అనే డౌట్ వచ్చే ఉంటుంది. అదే విధంగా టీ ఎప్పుడు తాగుతున్నాం అనేది కూడా ముఖ్యమే. షుగర్ పేషెంట్స్ టీ తాగడం మంచిదే అయితే.. టీని పంచదార లేకుండా తాగాలని నిపుణులు చెబుతూ ఉంటారు. కావాలి అంటే షుగర్ ఫ్రీ స్వీటెనర్స్ అయినా కలుపి తాగవచ్చు. కానీ పంచదార కలిపి మాత్రం..
Updated on: Jul 08, 2024 | 6:31 PM

షుగర్ ఉన్నవాళ్లు ఆహార విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటివి తీసుకుంటే ఏం జరుగుతుందో ముందే గమనించు కోవాలి. ఏది పడితే అది.. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. ఈ క్రమంలోనే షుగర్ పేషెంట్లు టీ తాగవచ్చా? అనే డౌట్ వచ్చే ఉంటుంది. అదే విధంగా టీ ఎప్పుడు తాగుతున్నాం అనేది కూడా ముఖ్యమే.

షుగర్ పేషెంట్స్ టీ తాగడం మంచిదే అయితే.. టీని పంచదార లేకుండా తాగాలని నిపుణులు చెబుతూ ఉంటారు. కావాలి అంటే షుగర్ ఫ్రీ స్వీటెనర్స్ అయినా కలుపి తాగవచ్చు. కానీ పంచదార కలిపి మాత్రం తీసుకోకూడదు.

పాలతో తయారు చేసిన టీలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి పాలతో చేసిన టీ తాగవచ్చు. కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీరు టీ తాగుతూ ఉంటే ఇతర కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తగ్గించేయాలని నిపుణులు చెబుతున్నారు.

అలాగే టీని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. దీనికంటూ ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకోండి. రెండు పూటలు కంటే ఒక పూట తాగడమే మంచిది. అలవాటు ఉన్నవారు తక్కువ మోతాదులో రెండు పూటలా తీసుకోండి.

టీ తాగే ముందు.. తాగిన తర్వాత మీ షుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం ముఖ్యం. షుగర్ లెవల్స్ పెరిగితే మీరు టీ మానేయడమే బెటర్. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా పంచదార లేకుండా పాలతో తయారు చేసిన టీ తాగితే మంచిది.




