- Telugu News Photo Gallery By following these tips, you can prevent eggs from cracking while boiling Telugu Lifestyle News
Kitchen Tips: ఉడకబెట్టే సమయంలో గుడ్లు పగిలిపోతున్నాయా.? ఈ సింపుల్ టిప్స్ పాటించండి, రిజల్ట్ పక్కా..
Kitchen Tips: కోడి గుడ్లను ఉడకబెట్టే సమయంలో పగిలిపోవడం సర్వసాధారణమైన విషయం. అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా కోడి గుడ్లు పగలకుండా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటంటే..
Updated on: Sep 15, 2022 | 2:59 PM

గుడ్డు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే రోజుకు ఒక గుడ్డు తినండి అని వైద్యులు సైతం సూచిస్తుంటారు. అంతెందుకు ప్రభుత్వాలు సైతం గుడ్డు తినమని ప్రచారం చేస్తుంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండే గుడ్డు ధర విషయంలోనూ అందుబాటులో ఉండడమే దీనికి కారణం.

ఇదిలా ఉంటే కోడి గుడ్డును ఆమ్లేట్ రూపంలో కాకుండా ఉడకబెట్టి తీసుకోవడం వల్లే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తుంటారు. ఆమ్లేట్ రూపంలో తీసుకోవడం వల్ల అందులో ఉపయోగించే నూనెతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.

అయితే కోడి గుడ్డు ఉడకబెట్టే సమయంలో కొన్ని సందర్భాల్లో గుడ్లు నీటిలో పగిలిపోతుంటాయి. దీనివల్ల గుడ్డు పాడవుతుంది. అయితే కొన్ని రకాల సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా గుడ్డును పగలబెట్టకుండా ఉడకబెట్టుకోవచ్చు.

సాధారణంగా చాలా మంది గుడ్లను ఉడకబెట్టడం కోసం చిన్న పాత్రలను ఎంచుకుంటారు. దీనికి కారణం ఎక్కువ గ్యాస్ వినియోగం అవుతుందని. అయితే చిన్న పాత్రల్లో ఉడకబెడితే ఒక గుడ్డుకు మరొకటి ఢీకొని పగిలిపోతాయి. అందుకే తక్కువ సంఖ్యలో అయినా సరే పెద్ద పాత్రలోనే ఉడకబెట్టాలి.

గుడ్లును ఉడకబెట్టే ముందు నీటిలో మొదట కొంత ఉప్పు వేయాలి. అనంతరం నీటిలో గుడ్లను ఉడకబెడితే పగలకుండా ఉంటాయి.

గుడ్లను ఫ్రిజ్‌లోనే నుంచి తీసిన వెంటనే ఉడకబెట్టొద్దు. దీనివల్ల గుడ్లు పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రిజ్‌లో నుంచి గుడ్లను తీసి కనీసం 15 నిమిషాల తర్వాతే ఉడకబెట్టాలి.





























