Faf Du Plessis: నమీబియా కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్! వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నీలో బరిలోకి..
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్ డు ప్లెసిస్ పేరుతోనే మరొక ఫాఫ్ డు ప్లెసిస్ నమీబియా అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు. 17 ఏళ్ల ఈ యువ క్రికెటర్ అండర్-19 ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్‌లో నమీబియాను నడిపించనున్నాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్‌గా ఉన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్.. నమీబియాకు కెప్టెన్ అయ్యాడా? అని షాక్ అవుతున్నారా? ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు మరో దేశానికి కామన్ అయిపోయింది. ఉన్న దేశంలో అవకాశాలు రాకనో, లేక వేరే దానికి ఆడితే పేరు, డబ్బు, గుర్తింపు వస్తుందనో చాలా మంది వేరే దేశాలకు వెళ్లి ఆ దేశపు జాతీయ జట్లకు ఆడుతున్నారు. అలాంటి వారిలో టిమ్ డేవిడ్, సికందర్ రజా లాంటి చాలా మంది ప్రస్తుత క్రికెటర్లు కూడా ఉన్నారు.
అలాగే క్రికెట్‌లో బుడిబుడి అడుగులు వేస్తున్న నమీబియాకు కెప్టెన్‌గా వెళ్లి, ఆ దేశంలో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు డుప్లెసిస్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని కూడా కొంత మంది అనుకొని ఉంటారు. కానీ, అలాంటిదేం లేదు. నమీబియా అండర్ 19 జట్టుకు కెప్టెన్ అయింది ఫాఫ్ డుప్లెసిసే. కానీ, సౌతాఫ్రికా ప్లేయర్, ఐపీఎల్‌లో ఆడుతున్న ఈ సీనియర్ డుప్లెసిస్ కాదు. అతను వేరే. కాకపోతే.. పేరు సేమ్ అవ్వడంతో ఇప్పుడు అతను వార్తల్లో నిలుస్తున్నాడు. 17 ఏళ్ల ఫాఫ్ డుప్లెసిస్ అనే కుర్రాడు నమీబియా అండర్ 19 జట్టుకు కెప్టెన్ అయ్యాడు.
అండర్ 19 వరల్డ్ కప్ కోసం జరుగుతున్న క్వాలిఫైయర్స్ టోర్నీలో నమీబియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి పేరు సంపాదించుకున్న సౌతాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ పేరు తన పేరు ఒక్కటే కావడంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది. కాగా అండర్ 19 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో నమీబియాతో పాటు కెన్యా, నైజీరియా, సియెర్రా లియోన్, టాంజానియా, ఉగాండా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ నైజీరియాలోని లాగోస్‌లో జరుగుతోంది. నమీబియా తన తొలి మ్యాచ్‌ను నైజీరియాతో ఆడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..