Subhash Goud | Edited By: Anil kumar poka
Updated on: Jan 28, 2022 | 9:57 AM
Tork Motors:ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా భారత్‌లో రకరకాల బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త కొత్త టెక్నాజీతో వాహనాలను రూపొందిస్తున్నాయి కంపెనీలు. ఇక భారత్‌లో ఫోర్జ్ మద్దతు ఉన్న టార్క్ మోటార్స్ మార్కెట్లో రెండు ఇ-బైక్‌లను విడుదల చేసింది.
క్రాటోస్, క్రాటోస్-ఆర్ పేరుతో విడుదలైన ఈ బైక్‌ల ఆన్‌లైన్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఈ బైక్‌ల డెలివరీని ప్రారంభించన్నట్లు సంస్థ తెలిపింది.
క్రాటోస్ పుణె ఎక్స్ షోరూమ్ ధర : రూ.1.08 లక్షలు ఉండగా, .4 కేడబ్ల్యుహెచ్ బ్యాటరీ120 కిలోమీటర్ల మైలేజి నాలుగు సెకన్లలో 0-40 కిలోమీటర్లు గంటకు 100 కిలోమీటర్ల గరిష్ఠ వేగం అందుకోనుంది.
క్రాటోస్ -ఆర్‌పుణె ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.23 లక్షలు. 9 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ 3.5 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగం. ఇక గరిష్ఠంగా గంటకు 105 కిలోమీటర్ల వేగం ఉంటుందని కంపెనీ తెలిపింది.