- Telugu News Photo Gallery Business photos These are the e scooters are the best gift to your sister on Raksha bandham, check details in telugu
Raksha Bandhan: మీ సోదరీమణులకు అరుదైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇవి ట్రై చేయండి..
తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్(రాఖీ పండుగ)కు సమయం దగ్గరపడింది. ఆ రోజున సోదరీమణులు, తమ సోదరుల చేతులకు రక్షా సూత్రం కట్టడం.. దానికి ప్రతిగా చెల్లళ్లు, అక్కలకు సోదరులు పలు బహుమతులు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏదో డ్రెస్సో లేక ఏ రింగ్ కాకుండా మీ సోదరీమణనులకు రోజూ ఉపయోగపడేలా మంచి బహుమతిని ఇస్తే ఎలా ఉంటుంది. ఆలోచించారా? మీరు ఒకవేళ అలాంటి ఆలోచనల్లో ఉంటే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాస్త ఎక్స్ పెన్సివ్ అయినా.. మీ సోదరీ మణులకు బెస్ట్ గిఫ్ట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీ సోదరీమణులకు గిఫ్ట్ గా ఇవ్వదగిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఓ లుక్కేయండి..
Madhu |
Updated on: Aug 13, 2024 | 4:16 PM

మార్కెట్లో బెస్ట్.. మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండే ఉంది. అనేక రకాల కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఓలా, టీవీఎస్, ఏథర్, హీరో వంటివి అధిక ప్రాచుర్యం పొందుతున్నాయి. అలాంటి బ్రాండ్ల నుంచి మీ సోదరీమణులకు బహుమతిగా ఇవ్వదగిన బెస్ట్ స్కూటర్ల ఇవి.

హీరో లైఫ్ వీ1.. యువ రైడర్ల కోసం ఫీచర్ రిచ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఆపరేషన్ వంటి ఫీచర్లు దీనిలో ఉంటాయి. బ్యాటరీ సామర్థ్యం 3.94కేడబ్ల్యూహెచ్ కాగా.. 6కేడబ్ల్యూ శక్తిని అందిస్తుంది. ఛార్జింగ్ సమయం సుమారు 5 గంటల 55 నిమిషాలు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ ఇస్తుంది. గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర ధర: 1,19,000 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఓలా ఎస్1 ప్రో జెన్ 2.. ఇది రెండో తరం ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి కొత్త డిజైన్, మరింత శక్తివంతమైన బ్యాటరీ ఉంటుంది. పల్సేటింగ్ పార్టీ మోడ్, కీలెస్ ఎంట్రీ, ఎఫెక్ట్‌లెస్ క్రూజింగ్ వంటి సరదా ఫీచర్‌లతో ఇది నిండి ఉంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. 11కేడబ్ల్యూ శక్తిని అందిస్తుంది. ఛార్జింగ్ సమయం సుమారు 6 గంటల 30 నిమిషాలు. రైడింగ్ రేంజ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 195 కిలోమీటర్లు ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. దీని ధర 1.29 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఏథర్ 450ఎక్స్ జెన్ 3.. ఆటోమేటిక్ హోల్డ్, సులభమైన పార్కింగ్ అసిస్ట్, అర్ధరాత్రి రైడ్‌ల కోసం గైడింగ్ లైట్లు వంటి ఫీచర్ల ద్వారా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనిలో 2.7 కేడబ్ల్యూ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. 6.2కేడబ్ల్యూ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. ఛార్జింగ్ సమయం సుమారు 6 గంటల 36 నిమిషాలు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 111 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని ధర 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్).

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్.. ఆధునిక సాంకేతికతతో వస్తున్న క్లాసిక్ స్కూటర్ ఇది. దీనిలో 3.04 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. పీక్ పవర్ 4.4 కేడబ్ల్యూ ఉంటుంది. ఛార్జింగ్ సమయం సుమారు 4 గంటల 30 నిమిషాలు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ ఇస్తుంది. గంటకు గరిష్టంగా 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీని ధర రూ.1.77 లక్షలు (ఎక్స్-షోరూమ్).





























