టాటా మోటార్స్ దాని ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ హారియర్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. హారియర్ ఈవీను 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించారు. వీటుఎల్(వెహికల్ టు లోడ్), వీటువీ (వెహికల్ టు వెహికల్) ఛార్జింగ్ సామర్థ్యాలతో హారియర్ ఈవీ జెన్2 ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారంగా పని చేస్తున్నారు. ఈ హారియర్ ఈవీ జూన్ 2024లో ప్రారంభించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం ఈ ఈవీ 50 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. అలాగే ఈ ఈవీ 400 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. హారియర్ ఈవీ రూ.22 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు.