- Telugu News Photo Gallery Business photos Buying Budget Bikes That Are Rocking the Market, Amazing Features at a Low Price, Budget Bikes details in telugu
Budget Bikes: మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్ బైక్స్ కొనుగోళ్లు… మైలేజ్‌లో వీటికి లేదు పోటీ
భారతదేశంలో ఉద్యోగస్తుల సంఖ్య ఎక్కువ. పెరుగుతున్న ఖర్చులు, అవసరాల నేపథ్యంలో ప్రతి రూపాయి పొదుపుగా వాడుకునే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే మారుతున్న రోజుల వల్ల ప్రతి ఇంట్లో బైక్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. ఆఫీస్‌కు వెళ్లాలన్నా, కుటుంబంతో సహా బయటకు వెళ్లాలన్నా బైక్ తప్పనిసరి అవుతుంది. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలు బైక్ నిర్వహణను భారంగా చేస్తుంది. ముఖ్యంగా ఓ సారి ట్యాంక్ ఫుల్‌చేయిస్తే కనీసం చెప్పుకునే మొత్తంలో కూడా మైలేజ్ రావడం లేదని బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో బడ్జెట్ బైక్స్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది. కాబట్టి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్ బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Apr 09, 2024 | 6:15 PM

బజాజ్ ప్లాటినా భారతదేశంలోని బడ్జెట్ బైక్స్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్‌లో ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర 67,808 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే ఈ బైక్ లీటర్‌కు 73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే 11 లీటర్ ఇంధన ట్యాంక్‌తో వచ్చే ఈ బైక్‌ను ఫుల్ ట్యాంక్ చేయిస్తే 803 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బడ్జెట్ సెగ్మెంట్‌లోని ప్రముఖ బైక్స్‌లో ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 59,998 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ లీటర్ 70 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ బైక్ 9.6 లీటర్ల ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బైక్‌లో ఓ సారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే 672 కిలో మీటర్ల మైలేజ్ వస్తుంది.

హెూండా లివో జపాన్ బ్రాండ్‌కు సంబంధించిన అత్యంత సరసమైన మోటార్ సైకిళ్లలో ఒకటి. బైక్ ప్రారంభ ధర రూ.78,500 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ లీటర్‌కు 74 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే ఈబైక్ 9 లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే ఓ సారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే ఇది 666 కిలో మీటర్లు దూసుకుపోతుంది.

హెూండా ఎస్‌పీ125 ప్రారంభ ధర రూ.86,017 (ఎక్స్) షోరూమ్). ఇది లీటర్‌కు 65 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. అలాగే ఈ బైక్ 11.2 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. ఈ బైక్‌లో ఓ సారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే 728 కిలో మీటర్ల మైలేజ్ వస్తుంది.

టీవీఎస్ స్పోర్ట్స్ బడ్జెట్ బైక్స్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 59,431 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ లీటర్‌కు 75 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే ఋ బైక్ 10 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. అందువల్ల ఈ బైక్‌ను ఫుల్ ట్యాంక్ చేయిస్తే 750 కిలోమీటర్లు మైలేజ్‌ను అందిస్తుంది.




