- Telugu News Photo Gallery Business photos The Revolt EV bike that is shaking the market, Do you know the price, Revolt RV Blazex details in telugu
Revolt RV Blazex: మార్కెట్‌ను షేక్ చేస్తున్న రివోల్ట్ ఈవీ బైక్.. ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతుంది. ఈవీ వాహనాల్లో స్కూటర్ల సేల్స్ గణనీయంగా ఉన్నాయి. అయితే ఈవీ బైక్స్ మార్కెట్‌లో తమ హవా చూపించుకోవడానికి చాలా కంపెనీలు నూతన ఈవీ బైక్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ రివోల్ట్ ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ పేరుతో నూతన ఈవీ బైక్‌ను లాంచ్ చేసింది.
Updated on: Feb 28, 2025 | 12:22 PM

రివోల్ట్ మోటార్స్ అధికారికంగా ఆర్‌వీ బ్లేజ్ఎక్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1,14,990 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్, ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌కు సీటు కింద ఛార్జింగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది.

ఈ బైక్ 4జీ టెలిమాటిక్స్, జీపీఎస్ నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్‌తో ఆకట్టుకుంటుంది.

ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ బైక్‌లో ఆరు అంగుళాల ఎల్‌సీడీ డిజిటల్ క్లస్టర్ ఆకట్టుుకుంటుంది. అలాగే రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ సీబీఎస్ బ్రేకింగ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ట్విన్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది.

రివోల్ట్ ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ 4 కేడబ్ల్యూ పీక్ పవర్ మోటార్‌తో వస్తుంది. అందువల్ల ఈ బైక్ గంటకు 85 కి.మీ. గరిష్ట వేగాన్ని అందిస్తుంది. అలాగే ఓ సారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ. పరిధిని అందిస్తుంది. ఈ బైక్‌ను కేవలం 80 నిమిషాల్లో 80 శాతం మేర చార్జింగ్ చేయవచ్చు.




