వన్ ప్లస్ నార్డ్ సీఈ-4 లైట్ 5 జీ ఫోన్ 1,080 x 2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో పని చేస్తుంది. స్నాప్ డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో పని చేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. 50 ఎంపీ సోనీ లైట్-600 ప్రైమరీ సెన్సార్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చే ఈ ఫోన్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ధర రూ.16,999గా ఉంది.