RBI Governor Shaktikanta Das: సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. కేవైసీ రూల్స్ సవరిస్తూ కీలక నిర్ణయం
Subhash Goud |
Updated on: May 05, 2021 | 1:57 PM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. కేవైసీ రూల్స్‌ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకు ..
Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. కేవైసీ రూల్స్‌ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తాజాగా బుధవారం ఈ ప్రకటన చేశారు.
ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకుని కేవైసీ నిబంధనలు సవరిస్తున్నట్లు వెల్లడించారు. ఆధార్ ద్వారా కేవైసీ సాయంతో బ్యాంకు ఖాతా తీసుకోవచ్చన్నారు. గతంలో ఆధార్ ఇకేవైసీ ద్వారా అకౌంట్ తెరిస్తే వాటిని లిమిటెడ్ కేవైసీ అకౌంట్లుగా పేర్కొనేవారు. కానీ ఇకపై అవి కూడా పూర్తి కేవైసీ అకౌంట్లుగా మారుతాయి.
వీడియో కేవైసీ ద్వారా బ్యాంకు అకౌంట్ తెరవవచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. ప్రజలు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. వీడియో కేవైసీకి ఆర్బీఐ అంగీకారం తెలపడం వల్ల చాలా మంది కరోనా సమయంలో ఎంతో ఊరట కలుగనుంది.
కరోనా ప్రతి కూల పరిస్థితుల్లో బ్యాంకు గ్రహితలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతుందని తెలిపారు. వెలువడుతున్న పలు నివేదికల ప్రకారం.. మరో మూడు నెలలు మారటోరియం బెనిఫిట్‌ను మళ్లీ తీసుకురావాలని బ్యాంకులు ఆర్బీఐకి ప్రతిపాదన చేశాయి.