- Telugu News Photo Gallery Business photos OnePlus Ivan (OnePlus Nord 2 CE) Price in India, Specifications Tipped; Likely to Features
OnePlus Ivan: వన్‌ప్లస్ నుంచి త్వరలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్, ధర లీక్..!
వన్‌ప్లస్ (OnePlus) దూసుకుపోతోంది. తాజాగా నార్డ్ సిరీస్‌లో మరో మోడల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ (OnePlus Nord 2 CE) పేరుతో ఈ కొత్త ..
Updated on: Dec 13, 2021 | 8:48 PM

వన్‌ప్లస్ (OnePlus) దూసుకుపోతోంది. తాజాగా నార్డ్ సిరీస్‌లో మరో మోడల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ (OnePlus Nord 2 CE) పేరుతో ఈ కొత్త మోడల్‌ను తీసుకువస్తోంది. దీనికి ఇవాన్ (Ivan) అని పేరు పెట్టింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి వివరాలు కంపెనీ వెల్లడించకపోయినా.. స్పెసిఫికేషన్, ధర అంచనా వివరాలు లీకయ్యాయి. ఈ మొబైల్ 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్నట్లు సమాచారం.

90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండనుంది. ఇక ఫ్రంట్ కెమెరా పంచ్ హోల్ డిజైన్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఇందులో మీడియాటెక్ డైమంసిటీ 900 ఎస్‌ఓసీ 5జీ ప్రసెసర్‌తో రన్ అవుతున్నట్లు సమాచారం. 6జీబీ, 8జీబీ,12జీబీ ర్యామ్‌లలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇక 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫ్రంట్ కెమెరా 16మెగాపిక్సెల్ ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. బ్యాటరీ 4500 ఉండే అవకాశం. ఈ ఫోన్ ధర రూ.24వేల నుంచి రూ.28వేల మధ్య ఉండనున్నట్లు అంచనా.




